Begin typing your search above and press return to search.
కె.రాఘవేంద్రరావు `పెళ్లి సందడి 3` తీస్తే ఈ అక్కా చెల్లెళ్లతోనే..!
By: Tupaki Desk | 29 Oct 2022 2:30 AM GMTఅక్కా చెల్లెళ్లు ఇద్దరూ ఒకే యువకుడితో డేటింగ్ చేస్తే ఆ స్టోరి ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన `పెళ్లి సందడి` థీమ్ లైన్ ఇదే. రవళి- దీప్తి భట్నాగర్ లతో ప్రేమాయణం సాగించే యువకుడిగా హీరో శ్రీకాంత్ అద్భుతంగా నటించారు. ఇటీవలే కె.రాఘవేంద్రరావు పెళ్లి సందడి సీక్వెల్ (పెళ్లి సంద-డి)ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ సిరీస్ లో మూడో పార్ట్ తెరకెక్కిస్తే ఎవరిని ఎంపిక చేయాలి? అంటే అభిమానులు ఇదిగో ఈ బ్యూటిఫుల్ కపూర్ సిస్టర్స్ పేర్లను సూచిస్తున్నారు ఈ ఫోటో వీక్షించాక..! కనిపిస్తున్న ఈ ఫోటోలో జాన్వీ కపూర్ - ఖుషీ కపూర్ నిజంగానే అంత అందంగా లవ్ లీగా కనిపిస్తున్నారు. కాబోయే వాడి కోసం కలలు గనే అందమైన రాకుమార్తెల్లా మెరిపిస్తున్నారు. ఒకవేళ నిజంగానే పెళ్లి సందడి 3 తెరకెక్కిస్తే కె.రాఘవేంద్రరావు ఒక ఆప్షన్ గా ఈ సిస్టర్స్ ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఆసక్తికరంగా ఈ భామలిద్దరూ ఒకే యువకుడితో రియల్ లైఫ్ లోను డేటింగ్ చేశారన్న పుకార్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జాన్వీ కపూర్ తన బాలీవుడ్ అరంగేట్రం కంటే ముందే వార్తల్లో నిలిచిన స్టార్ కిడ్. ధడక్ విడుదలకు ముందే జాన్వీ డేటింగ్ మ్యాటర్ వార్తల్లో నిలిచింది. అక్షత్ రంజన్- ఇషాన్ ఖట్టర్- కార్తీక్ ఆర్యన్ ఇలా తన సరసన నటించిన యువహీరోలతో లింకప్ వార్తలు వచ్చాయి. కానీ ఈ జాబితాలో అక్షత్ రంజన్ అనే పేరు కూడా ఉంది. కానీ ఇప్పుడు తాజా ఇంటర్వ్యూలో జాన్వీ తన డేటింగ్ జీవితంపై వచ్చిన కథనాలన్నిటినీ కొట్టి పారేసింది. జాన్వీ కపూర్ తన గురించి తాను చదివిన అన్ని చెత్త గాసిప్ ల గురించి చెప్పింది. తన సోదరి ఖుషీ కపూర్ .. జాన్వీ ఇద్దరూ వేర్వేరు సమయాల్లో అక్షత్ రాజన్ తో డేటింగ్ చేశారంటూ కథనాలు వచ్చాయి. కానీ ఇవేవీ నిజాలు కాదని జాన్వీ వ్యాఖ్యానించింది.
జాన్వీ కపూర్ తన చిన్ననాటి స్నేహితురాడు.. బెస్ట్ ఫ్రెండ్ అయిన అక్షత్ రాజన్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు జాతీయ మీడియాలు ప్రచురించడంతో అది ఇప్పటికే దుమారం రేపుతోంది. అయితే అవే పత్రికల్లో జాన్వీ-అక్షత్ విడిపోయిన తర్వాత అతడితో తన సోదరి ఖుషీ కపూర్ డేటింగ్ చేసినట్టు చదివానని కూడా జాన్వీ తెలిపింది. తామెవరూ అతనితో డేటింగ్ చేయలేదని ఆమె స్పష్టం చేసింది. చిన్నప్పటి నుంచి అతనే తమకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పింది. ICYMI అక్షత్ రాజన్ గామన్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి అతడు CMD. దేశంలో అత్యధిక సంఖ్యలో వంతెనలను నిర్మించిన అతిపెద్ద సంస్థల్లో ఇది ఒకటి. అక్షత్ రాజన్ కుటుంబం బచ్చన్ లతో కూడా చాలా సన్నిహితంగా ఉంటుంది.
జాన్వీ కపూర్ మరో చిరకాల స్నేహితుడైన ఓర్హాన్ అవత్రమణితో ప్రేమలో ఉందని ఇటీవల పుకార్లు వచ్చాయి. నిజానికి అతను ఫ్యాషన్ డిజైనర్. బాలీవుడ్ సర్కిల్స్ లో అతన్ని ఓర్రీ అని పిలుస్తారు. ఓర్హాన్ అవత్రామణి ఒకానొక సమయంలో తన స్నేహితురాలు సారా అలీ ఖాన్ తో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్లు వచ్చాయి. అతను ఇప్పుడు పాలక్ తివారీతో కూడా షికార్లు చేస్తూ కనిపిస్తున్నాడు. వృత్తిపరమైన అవసరాలతో యువనాయికలతో కలిసి కనిపించినా ఇలాంటి రూమర్లు పుట్టుకొచ్చేస్తున్నాయి. కానీ వేటికీ అధికారిక ధృవీకరణలు లేవు.
జాన్వీ కపూర్ తదుపరి మలయాళ చిత్రం హెలెన్ కి రీమేక్ అయిన మిలీ అనే సర్వైవర్ థ్రిల్లర్ డ్రామాలో కనిపించనుంది. అలాగే జాన్వీ తాను ప్రస్తుతం ఒంటరిగా ఉన్నానని తాజా ఇంటర్వ్యూలో చెప్పింది. ఇంటర్వ్యూ పేరుతో ఏదో ఒక రకంగా అన్ని గాసిప్పులకు జాన్వీ అలా చెక్ పెట్టిందన్నమాట!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.