Begin typing your search above and press return to search.
దర్శకేంద్రుడు అండ్ సన్ వాట్టూడూ?
By: Tupaki Desk | 24 May 2019 6:34 AM GMTదర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చాలా కాలంగా సైలెంట్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. `ఓం నమో వెంకటేశాయ` ఫెయిలయ్యాక చాలా గ్యాప్ తీసుకున్నారు. అయితే గత కొంతకాలంగా ఆయన రీబూట్ అయ్యి తిరిగి వస్తున్నారని.. త్వరలోనే ఓ స్టార్ హీరోతో భక్తిరస చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని ప్రచారమవుతోంది. అయితే ఇందులో నిజం ఎంతో కానీ.. కె.రాఘవేంద్రరావు మాత్రం అధికారికంగా ఏదీ ప్రకటించలేదు. ఈసారీ భక్తి సినిమాతో కంబ్యాక్ అవ్వాలన్న ప్లాన్ నిజమేనా? ఈ నిర్ణయం సరైనదేనా? అంటూ యూత్ ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు.
అసలు కె.రాఘవేంద్రరావు మైండ్ లో ఏం ఉంది? అంటూ ఫిలింనగర్ లో ఆసక్తిగా ముచ్చట సాగుతోంది. ఒక వేళ ఆయన దేవుళ్లపై సినిమా తీయాలనుకుంటే ఈసారి ఏ దేవుడిపై తీస్తారు? అన్న చర్చా ఆసక్తిని రేకెత్తిస్తోంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్లను తెరకెక్కించడంలో స్పెషలిస్టు అయిన కె.రాఘవేంద్రరావు ఎందుకని ఆ తరహా సినిమా తీయాలని అనుకోవడం లేదు? అంటే మంచు మనోజ్ హీరోగా తెరకెక్కించిన `ఝుమ్మంది నాదం` ఫెయిలవ్వడం కాన్ఫిడెన్స్ ని దెబ్బ తీసిందన్న మాటా వినిపిస్తోంది. ఈ వయసులో రొమాన్స్ .. లవ్ అంటూ సినిమాలు తీయడం సరికాదని కె.రాఘవేంద్రరావు భావిస్తున్నారని అర్థమవుతోంది.
మరోవైపు ఈ దర్శకదిగ్గజం కుమారుడు ప్రకాష్ కోవెలమూడి బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకుంటున్నారు. కంగన - రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్రల్లో `మెంటల్ హై క్యా` అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పూర్తిగా కథా వైవిధ్యం.. పాత్రల వైవిధ్యంతో తీస్తున్న ఈ ప్రయోగాత్మక సినిమా హిట్టవుతుందా? అంటూ బాలీవుడ్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ చిత్రానికి ప్రకాష్ కోవెలమూడి భార్య కనిక థిల్లాన్ స్క్రిప్టును అందించారు. `సైజ్ జీరో` తర్వాత ఈ జోడీ కలిసి వర్క్ చేసిన చిత్రంగా `మెంటల్ హై క్యా` త్వరలోనే రిలీజవుతోంది. ఈ సందర్భంగా డాడ్ - సన్ నెక్ట్స్ ఏంటి? దర్శకేంద్రుడు అండ్ సన్ వాట్టూడూ? అంటూ మాట్లాడుకుంటున్నారంతా.