Begin typing your search above and press return to search.
ఓటిటి వైపు దర్శకేండ్రుడి పెళ్లిసందడి..?
By: Tupaki Desk | 26 May 2021 4:30 PM GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా ఇంతకాలం థియేట్రికల్ రిలీజ్ గురించి వెయిట్ చేసిన సినిమాలు ఒక్కొక్కటిగా ఓటిటి బాటపడుతున్నాయి. ఎప్పుడైతే థియేటర్స్ మూతపడే సందర్బం వస్తుందో అప్పటినుండి జనాలు మళ్లీ ఓటిటి వైపు మొగ్గుచూపుతున్నారు. నిజానికి లాక్డౌన్ లో సినీ ప్రేక్షకులు కూడా ఓటిటిలకే బాగా అలవాటు పడిపోయారు. అందుకే మేకర్స్ ఓటిటి వైపు ఆలోచించకపోయినా ఓటిటిలే మేకర్స్ ను సంప్రదించి సినిమాలు రాబట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలోని చిన్న - మీడియం సినిమాలు ఓటిటిలే బెస్ట్ అనుకుంటున్నాయి. ఈ మధ్యలో వారానికి ఓ కొత్త సినిమా ఓటిటి రిలీజ్ అవుతున్నాయి. అందుకే వీక్షకులు కూడా మరో కొత్త సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
అలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కుతున్న 'పెళ్లి సందడి' ఒకటి. ఆయన దర్శకత్వంలో పాతికేళ్ల క్రితం బ్లాక్ బస్టర్ అయినటువంటి పెళ్లిసందడి సినిమా తరహాలోనే ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో లేడీ డైరెక్టర్ గౌరి రోనంకి టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. ఈ సినిమాలో సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తుండగా.. శ్రీలీల అనే తెలుగమ్మాయి హీరోయిన్ గా డెబ్యూ అవుతోంది. ప్రస్తుతం షూటింగ్ ముగింపు దశలో ఉన్నటువంటి ఈ సినిమా నుండి ఇప్పటికే రెండు రొమాంటిక్ సాంగ్స్ రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో ఆ సాంగ్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మాక్సిమం ఈ సినిమాకు అప్పటి టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు.
ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.. చంద్రబోస్ లిరిక్స్ అందిస్తున్నాడు. ఈ రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్ మూవీని ఆర్.కె. ఫిలిం అసోసియేట్స్ - ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్స్ పై మాధవి కోవెలమూడి - శోభు యార్లగడ్డ - ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చలు నడుస్తున్నాయి. ఇటీవలే 'ఏక్ మినీ కథ' మూవీకి ఓటిటి ఆఫర్ రావడంతో ఓకే చెప్పేసి ఈ నెల 27న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతోంది. ఇప్పుడు పెళ్లిసందడి మూవీకి కూడా అమెజాన్ - ఆహా లాంటి ఓటిటిల నుండి భారీ ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం. మరి వాతావరణం చూస్తుంటే ఇప్పట్లో థియేటర్స్ తెరచుకునేలా లేవు. కాబట్టి ఈ సినిమా ఎప్పుడైనా ఓటిటి రిలీజ్ కు ఓకే అయిపోవచ్చని టాక్.