Begin typing your search above and press return to search.

ఆ ప‌ద‌వికి రాఘ‌వేంద్ర‌రావు రాజీనామా!

By:  Tupaki Desk   |   27 May 2019 8:05 AM GMT
ఆ ప‌ద‌వికి రాఘ‌వేంద్ర‌రావు రాజీనామా!
X
అధికార బ‌దిలీ చోటు చేసుకునేట‌ప్పుడు.. కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకోవ‌టం మామూలే. తాజాగా అలాంటి ప‌రిస్థితే ఏపీలో నెల‌కొంది. ఇప్పుడా రాష్ట్రంలో టీడీపీ హ‌యాంలో నామినేట్ అయిన ప‌ద‌వుల‌కు రాజీనామా చేయ‌టం మొద‌లైంది. అధికార‌ప‌క్షానికి ఇష్టం లేని వారు ప‌ద‌విలో ఉన్నా.. మార్చేయ‌టం ఖాయం.

ఆ వాస్త‌వాన్ని గుర్తించి.. గౌర‌వంగా ముందే త‌ప్పుకుంటే స‌రి. ఇప్పుడు అదే ప‌ని చేశారు ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు. ఆయ‌న్ను శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ఛైర్మ‌న్ ప‌ద‌విని అప్ప‌గిస్తూ చంద్ర‌బాబు స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంది. ఈ ప‌ద‌వికి రాజీనామా చేస్తే తాజాగా ద‌ర్శ‌కేంద్రుడు నిర్ణ‌యం తీసుకున్నారు.

అయితే.. తాను ప‌ద‌వికి రాజీనామా చేయ‌టానికి కార‌ణం వ‌యోభారంగా ఆయ‌న పేర్కొన‌టం విశేషం. టీటీడీ యాజ‌మాన్యానికి.. సిబ్బందికి ఆ తిరుమ‌లేశుడి ఆశీర్వాదాలు ఉండాల‌ని కోరుకున్న‌ట్లుగా పేర్కొన్నారు. 2015 నుంచి టీటీడీ బోర్డు స‌భ్యుడిగా ఉన్న ఆయ‌న‌.. తాజాగా టీటీడీకి చెందిన ఛాన‌ల్ కు రాజీనామా చేశారు. రేపు (మంగ‌ళ‌వారం) టీటీడీ బోర్డు మీటింగ్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో.. బోర్డు మెంబ‌ర్ గా ఉన్న రాఘ‌వేంద్ర‌రావు త‌నకున్న బోర్డు మెంబ‌ర్ ప‌ద‌వికి కూడా రాజీనామా చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.