Begin typing your search above and press return to search.
గోదారితో విశ్వనాథుడి బంధం
By: Tupaki Desk | 26 April 2017 8:13 AM GMTకళా తపస్వి కె. విశ్వనాథ్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడంపై.. తెలుగు సినీ ప్రేక్షక లోకం ఎంతో సంతోషంగా ఉంది. అందరి కంటే ఎక్కువగా గోదారి జిల్లాల ప్రజలు ఆనంద పడిపోతున్నారు. ఇందుకు కారణం.. విశ్వనాథుడి సినిమాలకు గోదావరి తీరానికి విడదీయరాని అనుబంధం ఉండడమే.
విశ్వనాథ్ సినిమాల్లో గోదావరి తీరం అనేక మార్లు కనిపిస్తుంది. తెలుగు సినిమాకు.. కె. విశ్వనాథ్ కి అజరామరమైన ఖ్యాతిని అందించిన శంకరాభరణంను.. ఇక్కడే రూపొందించారు. శారద చిత్రాన్ని రాజమండ్రి.. ఇనుగంటివారి పేట.. మునికూడలి ప్రాంతాల్లో తెరకెక్కించారు. శోభన్ బాబు మూవీ జీవనజ్యోతి అంతా కోనసీమ అందాల మధ్యే ఉంటుంది. ఆ తర్వాత జీవిత నౌక కూడా ఇక్కడే రూపొందించే. సిరిసిరిమువ్వు మూవీ రాజమండ్రిలోనే తీశారు విశ్వనాథ్.
స్వాతిముత్యం.. శంకరాభరణం.. స్వాతికిరణం.. సూత్రధారులు.. శుభప్రదం చిత్రాలను కూడా గోదారి జిల్లాల అందాలతోనే తీశారాయన. విశ్వనాథ్ తెరకెక్కించిన ఎన్నో ఆణిముత్యాలు గోదావరి జిల్లాల్లో తీసినవి కావడంతో.. ఇప్పుడాయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ దక్కడాన్ని.. గోదావరి దక్కిన గౌరవంగా భావిస్తున్నామంటున్నారు స్థానికులు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/