Begin typing your search above and press return to search.
నాతో పెట్టుకున్న ఏడుగురు పోయారు.. తర్వాత నువ్వే : కేఏపాల్
By: Tupaki Desk | 17 Dec 2019 5:39 AM GMTవర్మ దర్శకత్వంలో వచ్చిన వివాదాస్పద 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమా వివాదం ఇంకా సమసి పోవడం లేదు. ఈ సినిమా విడుదలకు ముందు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏపాల్ సినిమాను విడుదల కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. తనకు వ్యతిరేకంగా ఉన్న సీన్స్ తొలగించిన తర్వాత విడుదల చేయాలంటూ కోర్టుకు వెళ్లాడు. సినిమా విడుదల తర్వాత కేఏపాల్ స్పందిస్తూ నైతికంగా తనదే విజయం అంటూ ప్రకటించిన విషయం తెల్సిందే.
మరోసారి సోషల్ మీడియాలో పాల్ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా గురించి మాట్లాడాడు. తాను కేసులు పెట్టడం వల్లే వర్మ సినిమా టైటిల్ ను మార్చడంతో పాటు సినిమాలోని పలు సీన్స్ ను తొలగించాడంటూ పాల్ చెప్పుకొచ్చాడు. వర్మ మరో చెత్త సినిమా తీశాడని చెప్పుకోవడానికి ఏమీ లేదన్నాడు. నాపై తీసిన సీన్స్ ను తొలగించడం అనేది నా విజయంగా భావిస్తున్నాను. వర్మ మంచి సినిమాలు చేయడం ఎప్పుడో మర్చిపోయాడు అంటూ పాల్ ఎద్దేవ చేశాడు.
ఇంకా పాల్ మాట్లాడుతూ.. ఈ క్రిస్మస్ సమయంలో నా సమయంను వృదా చేస్తున్నాడు. ప్రస్తుతం అమెరికాలో చాలా బిజీగా ఉన్న తనను ఇబ్బంది పెట్టేందుకు వర్మ చేస్తున్న ప్రయత్నాలు ఏమీ కూడా వర్కౌట్ అవ్వవు అన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా గతంలో నాతో మరియు జీసెస్ తో ఏడుగురు పెట్టుకున్నారు. ఆ తర్వాత వారు కనిపించకుండా పోయారు. రామ్ గోపాల్ వర్మ పరిస్థితి కూడా అంతే అవుతుందని.. ఆ ఏడుగురితో పాటు ఆయన కూడా కనుమరుగవుతాడు అంటూ పాల్ హెచ్చరించాడు.