Begin typing your search above and press return to search.
వర్మ 'కమ్మరాజ్యా'నికి బ్రేక్ వేసిన కేఏ పాల్!
By: Tupaki Desk | 21 Nov 2019 9:09 AM GMTవర్మ ..ఏదైనా సినిమా ప్రారంభించడానికి ముందే ఆ సినిమాని ఎలా వివాదంలోకి నెట్టాలో ఆలోచిస్తాడు. ఇంతవరకు రామ్ గోపాల్ వర్మ తీసిన చాలా చిత్రాలకి పెద్దగా ప్రమోషన్స్ చేసిన దాఖలాలు లేవు. సినిమా ప్రారంభం నుండి ..థియేటర్ లోకి వచ్చే వరకు సినిమాపై ఎదో ఒక వివాదం ఉండేలా వర్మ ప్లాన్ చేస్తారు..దీనితో ఆ సినిమాకి మళ్లీ ప్రత్యేకంగా ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదు. అసలు వర్మ సినిమా అంటే ..ఆ సినిమాకి ఒక బ్రాండ్ ఉంటుంది.
వర్మ ఏ సినిమా తీసినా అదొక సంచలనమే. ఇప్పటికే ఎన్నో సంచలన చిత్రాలని తెరకెక్కించిన వర్మ ..తాజాగా ఏపీ రాజకీయాలపై కమ్మరాజ్యం లో కడప రెడ్లు అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చంద్రబాబు - సీఎం జగన్ పాత్రలు ప్రధాన పాత్రలుగా ఉండబోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన పాటలు - ట్రైలర్స్ అన్ని కూడా ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకోవడంతో సినిమాకి భారీ హైప్ వచ్చింది. కానీ , ఇప్పటివరకు ఈ సినిమా పై ఎటువంటి కేసు కూడా నమోదు కాకపోవడం తో అందరూ ఆశ్చర్యానికి గురౌతున్నారు.
ఈ సమయంలో కమ్మరాజ్యం పై తోలి కేసు నమోదైంది. ఇంతకీ ఈ సినిమా పై కేసు పెట్టింది ఎవరో తెలుసా ? ఏపీలో ఎన్నికల సమయంలో నేనే కాబోయే సీఎం - ఆంధ్రాని అమెరికా చేస్తా అంటూ ప్రచారంతో హోరెత్తించిన మత ప్రబోధకుడు కేఎ పాల్ పిటిషన్ దాఖలు చేసారు. కమ్మరాజ్యం లో కడప రెడ్లు సినిమా లో తనను అవమానించేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ - ఈ సినిమాలో తన పాత్రను అవమానించేలా తీశారని ఆయన ఆరోపించారు. దీని వల్ల తన ప్రతిష్ట దెబ్బతింటోందని - ఈ సినిమాను ఆపేయాలంటూ హైకోర్టుని కోరారు. దీనిపై హైకోర్టు కేంద్ర ప్రసార శాఖకు - సెన్సార్ బోర్డుకు నోటీసులు ఇచ్చింది. దీనిపై కోర్టు ఏంచెప్తుందో చూడాలి. ఏదేమైనా వర్మ మార్క్ పబ్లిసిటీ కమ్మరాజ్యానికి ప్రారంభమైంది అని చెప్పవచ్చు.