Begin typing your search above and press return to search.
ఈ పిచ్చి పోలికలు ఏంటి తంబీ?
By: Tupaki Desk | 29 May 2018 10:12 AM GMTఇండియన్ సినిమా ఫాన్స్ నందు తమిళ ఫాన్స్ వేరయా అని ఊరికే అనలేదు. తమ హీరోల మీద విపరీతమైన అభిమానాన్ని ప్రదర్శించడంలో దేశం మొత్తంలో ఆరవ బ్యాచ్ ది చాలా ప్రత్యేక స్టైల్. పాలాభిషేకాలు చేయటం లారీల కొద్దీ పూలు తెచ్చి థియేటర్ ముందు చల్లడం నటీనటులకు గుడులు కట్టి గుండు కొట్టించుకోవడం వాళ్ళకే చెల్లింది. సోషల్ మీడియా వాడకం కూడా వీరిది మాములుగా ఉండదు. ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలు లేక నాలుగు నెలల నుంచి చప్పగా ఉండటం వల్ల ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ఫాన్స్ వార్ మళ్ళి జడలు విప్పుకుంది. నిన్న సాయంత్రం విడుదలైన కాలా ట్రైలర్ దీనికి నాంది పలికింది. కాలా ట్రైలర్ లో సీన్లు అచ్చం తమ విజయ్ మెర్సల్ సినిమాలో మాదిరి ఉన్నాయని హిట్ కోసం తమ హీరో ఫార్ములాను వాడుకున్నారని విజయ్ ఫాన్స్ సోషల్ మీడియాలో ట్రాలింగ్ మొదలు పెట్టారు.దానికి ఉదాహరణగా హోలీ ఆడే సీన్ మెర్సల్ ది తీసుకున్నారని పోలిక పెట్టి మరీ చూపించారు.
దీనికి తలైవా ఫాన్స్ ఊరికే ఉంటారా. అంతకు అంతా బదులు చెప్పడం మొదలు పెట్టారు. అసలు స్టైల్ లో కానీ స్టేచర్ లో కానీ ఏ మాత్రం పోలిక లేని విజయ్ సినిమాతో కాలాను పోలుస్తారా అంటూ మెర్సల్ సీన్లు గతంలో ఏ ఏ సినిమాల్లో వచ్చాయో లిస్ట్ పెట్టడం మొదలుపెట్టారు. అయినా వీళ్ళ పిచ్చి కానీ మాస్ సినిమా ఫార్ములా దేనికైనా ఒకేలా ఉంటుంది. హోలీ ఆడే సీన్లు షోలే నుంచి మొదలుకుని కొన్ని వేల సినిమాల్లో వచ్చాయి. అదేదో మెర్సల్ నుంచే ప్రారంభం అయ్యింది అనేలా చెప్పడం కరెక్ట్ కాదు. స్టేచర్ గురించి రజని ఫాన్స్ ఎగతాళి చేయటము సరికాదు. మెర్సల్ లాంటి రెగ్యులర్ కమర్షియల్ మూవీ నుంచే వంద కోట్లు రాబట్టిన విజయ్ మార్కెట్ చిన్నది కాదు. మేము మేము బాగుంటాం మా మధ్య ఏమి లేదు అని హీరోలు ఎంత మొత్తుకున్నా వీళ్ళలో మాత్రం మార్పు రాలేదు. వీళ్లకు ఏ మాత్రం తీసిపోని అజిత్ ఫాన్స్ మాత్రం ఈసారి సైలెంట్ గా ఉన్నారు. తమ హీరో కొత్త సినిమా దగ్గరలో లేదు కాబట్టి ఈ విషయంలో మౌనాన్ని ఆశ్రయించారు