Begin typing your search above and press return to search.

ఈ రీమేక్ మనదాకా రాదా?

By:  Tupaki Desk   |   23 Nov 2018 5:30 PM GMT
ఈ రీమేక్ మనదాకా రాదా?
X
ఇటీవలే తమిళ్ లో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న కాత్రిన్ మోజీని డబ్బింగ్ చేయాలా లేక రీమేక్ చేయాలా అనే అయోమయంలో నిర్మాతలున్నట్టు సమాచారం. జ్యోతిక టైటిల్ రోల్ లో మరొక కీలక పాత్రలో మంచు లక్ష్మి నటించిన ఈ మూవీ హిందీ సూపర్ హిట్ తుమారి సులుకి రీమేక్. అందులో విద్య బాలన్ చేసిన రోల్ ఇక్కడ జ్యోతిక చేస్తే నేహా ధూపియా పాత్ర మంచు లక్ష్మికి దక్కింది.

మొన్న శుక్రవారం బాక్స్ ఆఫీస్ వార్ లో కాత్రిన్ మోజీనే విజేతగా నిలిచింది. జ్యోతికకు తెలుగులో మంచి గుర్తింపు ఉంది కానీ తన సినిమాలు ఎందుకనో తెలుగులో రావడం లేదు. ఆ మధ్య బాలా తీసిన ఓ థ్రిల్లర్ ని డబ్ చేసి వదిలారు కానీ మనవాళ్ళు పట్టించుకోలేదు. పోలీస్ ఆఫీసర్ గా జ్యోతిక మాస్ విశ్వరూపాన్ని మిస్ అయిపోయారు. తర్వాత మరో రెండు సినిమాలు జ్యోతిక టైటిల్ రోల్ లో హిట్ అయ్యాయి కానీ అవేవి తెలుగులో రాలేదు.

కానీ తుమరీ సులు యూనివర్సల్ కాన్సెప్ట్. ఎవరైనా చేయొచ్చు. కాకపోతే కాస్త ముప్పై దాటిన వయసున్న అమ్మాయిలా కనపడే హీరోయిన్ అయితే బెటర్. కానీ ఇక్కడ జ్యోతికలాగా ఆ ఏజ్ తో మంచి గ్లామర్ ని మైంటైన్ చేస్తున్న వాళ్ళు ప్రస్తుతానికి ఎవరూ కనిపించడం లేదు. హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్ ఉండే క్వీన్ రీమేక్ కే ఇక్కడ నాలుగేళ్లు పట్టింది. అలాంటిది జ్యోతిక లాంటి ఆర్టిస్టుని సెట్ చేసుకోవడం అంత ఈజీ కాదు. అందుకే కాత్రిన్ మోజీ తెలుగులో వచ్చే అవకాశాలు తక్కువే. పోనీ రీమేక్ అంటే అదీ అంత ఈజీ కాదు. సో ఈ రకంగా మరో మంచి సినిమాను హిందీ రాని తెలుగు ప్రేక్షకులు మిస్ అయినట్టే