Begin typing your search above and press return to search.

ఎక్స్ క్లూజివ్‌: కబాలి ఆల్ టైమ్ రికార్డు అదుర్శ్‌

By:  Tupaki Desk   |   23 July 2016 1:19 PM GMT
ఎక్స్ క్లూజివ్‌: కబాలి ఆల్ టైమ్ రికార్డు అదుర్శ్‌
X
సినిమా టాక్‌ ఎలా ఉన్నా కూడా.. కబాలి లెక్క అంటే లెక్కే. తుప్పు రేగ్గొట్టేశాడు. హైప్‌ అనేది ఉంటే రజనీకాంత్‌ సినిమా ఏ రేంజులో ఉంటుందో అందరికీ చూపించాడు. ఇండియాలోనే ఏ హీరోకు కూడా రానంత ఓపెనింగ్ ''కబాలి'' సినిమాకు వచ్చింది. ఎన్ని బాహుబలులు వచ్చినా.. ఎన్ని సుల్తాన్ లు వచ్చినా.. కబాలి తుఫాన్‌ ముందు అన్నీ దిగదుడుపే అని ప్రూవ్ చేశాడు రజనీకాంత్.

జూలై 22న (నిన్న) విడుదలైన ''కబాలి'' సినిమా.. ఇండియా లెక్కల వరకు చూస్తే.. విడుదలైన అన్ని బాషల్లోనూ కలుపుకుని.. 47.2 కోట్లు 'నెట్‌' వసూలు చేసింది. ఇప్పటివరకు మన దగ్గర హైయెస్ట్ అంటే బాహుబలి వసూలు చేసిన 42.1 కోట్లు అనే చెప్పాలి. ఇప్పటివరకు రెండో పొజిషన్లో ఉన్న ప్రేమ్ రతన్ ధన్ పాయో ఇప్పుడు 3వ స్థానానికి పడిపోయింది. ఈ సినిమా తొలిరోజు షుమారు బాహుబలికి దగ్గరగా 41 కోట్లు నెట్ వసూలు చేసింది. ఆ లెక్కన చూస్తే ఎవరు బ్రేక్ చేయలేనంత రేంజులో ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది కబాలి. మొన్న వచ్చిన సుల్తాన్ సినిమా కేవలం 36 కోట్ల దగ్గరే ఆగిపోయింది. ఇక ఇండియా టాప్ 10 లిస్టులో.. కబాలి అండ్ బాహుబలి తప్పించి మరో సౌత్ సినిమా ఏదీ లేదులే.

కబాలి తొలిరోజు కలక్షన్ల విషయానికొస్తే.. తెలుగులో 9.26 కోట్లు షేర్‌ సాధించిన ఈ సినిమా.. తమిళనాడులో 14 కోట్లు.. కర్ణాటకలో 4.03 కోట్లు.. కేరళలో 2 కోట్లు.. అమెరికా-కెనడాల్లో కలుపుకుని 11.5 కోట్లు.. ఇతరత్రా మరో 12 కోట్లు షేర్‌ వసూలు చేసి.. మొత్తంగా తొలిరోజున 53.59 కోట్ల షేర్‌ వసూలు చేసింది. గ్రాస్ లెక్కల్లో చూస్తే.. 87.5 కోట్లు వచ్చినట్లు.

ఇక ప్రపంచ వ్యాప్త కలక్షన్లతో చూసుకున్నా కూడా.. ''కబాలి'' ఆల్ టైమ్ నెం.1 మొదటి రోజు వసూళ్లు సాధించింది. దటీజ్ రజనీకాంత్‌.