Begin typing your search above and press return to search.
'కబాలి'ని కూడా వేసేస్తున్నారు!!
By: Tupaki Desk | 5 Nov 2016 7:30 AM GMTసినిమాలను చకచకా థియేటర్లలోకి తెచ్చేందుకు దర్శక నిర్మాతలు ఎంతగానో ఆరాట పడతారు.. అందుకు తగ్గట్లుగా కష్టపడతారు. వసూళ్ల కోసం ప్రచారంతో హోరెత్తిస్తారు. ఇప్పుడీ సినిమాల రైట్స్ కొనుక్కున్న టీవీ ఛానళ్లు అంతకు మించి హంగామా చేసేయాల్సి వస్తోంది. సినిమాపై ఉన్న అంచనాలను బేస్ చేసుకుని భారీ మొత్తాలు ఇచ్చి కొనుక్కున్న ఛానళ్లు.. వీలైనంత త్వరగా టెలికాస్ట్ చేసేసి డబ్బులు రాబట్టుకునేందుకు తాపత్రయపడుతున్నాయి.
రజినీకాంత్ లేటెస్ట్ మూవీ కబాలి ఇప్పుడు టీవీల్లోకి వచ్చేస్తోంది. తమిళ్.. తెలుగు వెర్షన్లపై క్లారిటీ లేదు కానీ.. హిందీ వెర్షన్ మాత్రం స్టార్ గోల్డ్ లో ప్రసారం కానుంది. నవంబర్ 20న కబాలి ప్రదర్శితం కానుండగా.. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రమోషన్స్ పీక్ స్టేజ్ లో చేసేస్తోంది ఆ ఛానల్. తమిళ్.. తెలుగు కబాలి కూడా త్వరలో టీవీల్లో వచ్చేయడం ఖాయం. కాకపోతే.. ఇక్కడ ఏదైనా పండుగ రోజు చూసుకుని పెద్ద సినిమాలను టెలికాస్ట్ చేయడం ఆనవాయితీ.
టెలికాస్ట్ చేసే తేదీ నంబర్ 20 నాటికి కబాలి రిలీజ్ అయ్యి సరిగ్గా 120 రోజులు అవుతుంది. అంటే నాలుగు నెలల్లోనే టీవీల్లోకి వచ్చేస్తోందన్న మాట. రీసెంట్ గా ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ ని అయితే 50 రోజుల్లోనే టీవీల్లో వేసేశారు. టీవీ ఛానళ్లు ఆయా సినిమాల క్రేజ్ తగ్గక ముందే ప్రసారం చేసేయాలని పడుతున్న తపన.. ఈ స్పీడ్ చూస్తే అర్ధమవుతుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/