Begin typing your search above and press return to search.

మలేషియా పోలీస్ వ్యవస్థపై కబాలి కన్సర్న్!

By:  Tupaki Desk   |   25 July 2016 6:32 AM GMT
మలేషియా పోలీస్ వ్యవస్థపై కబాలి కన్సర్న్!
X
భూమి - ఆకాశం అనే తారతమ్యాలు లేకుండా ప్రపంచస్థాయిలో భారీ ప్రమోషన్స్ తో విడుదలయ్యింది కబాలి సినిమా. విడుదల అనంతరం వచ్చిన ఫలితం గురించి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబందించి ఒక కొత్త విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. భారతదేశంలోనూ - మలేషియాలోనూ సినిమా క్లైమాక్స్ లో మార్పు ఉండటమేనంట. దీంతో దేశాన్ని బట్టి క్లైమాక్స్ సీన్స్ మార్చారా అనే అనుమానం కలుగుతుంది. అనుమానం అక్కరలేదు.. దానికి ఒక కారణం ఉందని చెబుతున్నారట చిత్ర యూనిట్!

విషయానికొస్తే... కబాలి క్లైమాక్స్ లో ఒక విద్యార్థి వచ్చి కాల్పులు జరపడం - అనంతరం తెరపై దర్శకుడి పేరు కనబడటం.. సీక్వెల్ పై సందేహాలు రావడం తెలిసిందే. అయితే.. మలేషియా ప్రేక్షకులకు మాత్రం వేరే క్లైమాక్స్ ని అందించాడు దర్శకుడు. విలన్స్ ని తుదిముట్టించిన తర్వాత కబాలి మలేషియన్ పోలీసులకు లొంగిపోయారనే విషయం అక్కడ థియేటర్లలో ఎండ్ టైటిల్స్ లో వేశారు. దీంతో దేశాల వారీగా క్లైమాక్స్ మార్చారా అనే అనుమానం కలిగింది.

తీరా విషయంపై ఆరా తీస్తే.. ఈ సినిమా షూటింగ్ అధికభాగం మలేషియాలోనే జరిగింది.. దాంతో అక్కడ పోలీస్ వ్యవస్థను కించపరచకూడదని పతాక సన్నివేశాల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాడట దర్శకుడు. ఇది అసలు విషయం!! క్లైమాక్స్ అయితే మారింది కానీ.. ఫలితం?