Begin typing your search above and press return to search.
కబాలి క్లైమాక్స్ కి కారణమేమిటి?
By: Tupaki Desk | 23 July 2016 5:30 PM GMTకబాలి సినిమా అధిక శాతం ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన విషయం విదితమే. రజిని కాంత్ నుండి ఆశించే డైలాగులు - మ్యానరిజమ్స్ - ఫైట్ లు ఈ సినిమాలో కరువవడంతో అందరూ దర్శకుడిపై పెదవి విరుస్తున్నారు.
అయితే ఈ ఆలోచనల్లో బయటకు నడుద్దామని అనుకున్న ప్రేక్షకుడికి యాంటీ క్లైమాక్స్ ఎండింగ్ ఇచ్చి దర్శకుడు మరింత కన్ఫ్యూజ్ చేశాడు. అంతా సాఫీ అనుకున్న సమయంలో తన కింద పనిచేసే వ్యక్తి గన్ తీయడంతో సినిమా విజువల్ ఆగిపోతుంది. బ్లాక్ స్క్రీన్ మీద గన్ షాట్ సౌండ్ వినబడుతుంది. సో కబాలి చంపబడ్డాడా లేక ఎదురుతిరిగి చంపాడా అన్న జవాబు దర్శకుడు మనకే వదిలేశాడు.
గ్యాంగ్ స్టర్ లకు నిత్యం శత్రువుల బెడదే అన్న ఆలోచనలో దర్శకుడు ఈ షాట్ తీసి ఉండచ్చు. లేక కమల్ మణిరత్నం నాయకుడు సినిమాకు స్ఫూర్తి కావచ్చు. అయితే ప్రేక్షకులు మాత్రం దీనిపై జోకులు వేయడం విశేషం. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్నకంటే పెద్ద ప్రశ్న కావడానికి ఇలా చేశాడని కొందరు అంటుంటే, కబాలి 2 తీయాలనే భయంకరమైన ఆలోచనతోనే ఇలా ముగించాడని కొందరి భావన. కనీసం దీనికైనా దర్శకుడు వివరణ ఇస్తే బాగుణ్ణు..