Begin typing your search above and press return to search.
కబాలి 400 కోట్లు.. ఎలాగంటే...
By: Tupaki Desk | 25 July 2016 3:30 PM GMTతొలి వీకెండ్ పూర్తయ్యేసరికి ఇండియాలో 'కబాలి' సినిమా ప్రపంచవ్యాప్తంగా 211 కోట్ల షుమారు గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ పండితులు చెబుతుంటే.. కబాలి నిర్మాత కలైపులి థాను మాత్రం.. ఏకంగా 400 కోట్లు వచ్చిందని చెబుతున్నారు. ఆయన జేబులో ఇప్పుడు 400 కోట్లు నిజంగానే పడ్డాయా? ఇదే విషయంపై ఒక ప్రముఖ బాలీవుడ్ మీడియా ఆయన్ను కలసి విస్తుపోయింది. పదండి చూద్దాం.
నిజానికి ట్రేడ్ వర్గాలు చెప్పినట్లు 211 కోట్ల గ్రాస్ అనేది కరక్టేనట. అయితే ఆయన మొత్తంగా కబాలి ఎంత వసూలు చేసిందో చెబుతున్నారట. రిలీజవ్వడానికి ముందే.. ఆడియో రైట్స్ - శాటిలైట్ - డిజిటల్ రైట్స్ - బ్రాండింగ్ - మర్చండైజ్.. ఇలా అన్నీ కలుపుకుని కబాలి ఖాతాలో 200 కోట్లు వచ్చిపడ్డాయట. ఇక డిస్ర్టిబ్యూషన్ లెక్కలను పక్కనెట్టేసి.. కేవలం కలక్షన్ల బట్టి మాట్లాడి.. ఈ 200 కోట్లను ఆ 200 కోట్లతో కలిపి.. 400 కోట్లు అంటున్నారు ఆ నిర్మాత అంటూ ఒక బాలీవుడ్ మీడియా వ్యాఖ్యానించింది. అయితే ఇక్కడే ఇంకో అవాక్కయ్యే డిటైల్ కూడా ఉందండోయ్.
కబాలి సినిమా మేకింగ్ కాస్ట్ కేవలం 15 కోట్లు మాత్రమేనట. సినిమా చూస్తే తెలుస్తోందిగా.. అంతకంటే ఏం ఖర్చువుతుందిలే. కాకపోతే సూపర్ స్టార్ రజనీకాంత్ రెమ్యూనరేషన్ మాత్రం 50-60 కోట్ల షుమారు ఉందట. ఎలా చూసినా కూడా.. కబాలి నిర్మాత ఒక 100 కోట్ల ప్రాఫిట్ జేబులో వేసుకునేలా ఉన్నాడే.