Begin typing your search above and press return to search.
కబాలి టికెట్లు రెండు గంటల్లో హాంఫట్
By: Tupaki Desk | 14 July 2016 7:38 AM GMTరెండు వారాల కిందట మలేషియాలో ‘కబాలి’ ప్రిమియర్ షో టికెట్లు అందుబాటులో ఉంచారు. ఐతే అప్పటికి ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో విపరీతమైన కన్ఫ్యూజన్ నడుస్తోంది. అయినప్పటికీ అభిమానులు అస్సలు తగ్గలేదు. టికెట్లు అందుబాటులో ఉంచిన కొన్ని గంటల్లోనే కొనేశారు. ఇప్పుడిక రిలీజ్ డేట్ కూడా కన్ఫమ్ అయిపోయింది. ఇక ఫ్యాన్స్ ఎక్కడ ఆగుతారు?
అమెరికాలోని శాన్ జోస్ లో ఒక థియేటర్లో ప్రిమియర్ షో టికెట్లు 25 డాలర్ల ధరతో ఇలా అమ్మకానికి పెట్టారో లేదో.. రెండే రెండు గంటల్లో అన్నీ హాంఫట్ అయిపోయాయి. అమెరికాలో తెలుగు-తమిళ భాషల్లో కలిపి ‘కబాలి’ 400 స్క్రీన్లలో రిలీజవుతుండటం విశేషం. సౌత్ ఇండియన్ సినిమాల్లో ఇదో రికార్డు. ఈ స్క్రీన్లన్నింట్లోనూ ప్రిమియర్ షోలు ప్లాన్ చేస్తున్నారు. సౌత్ ఇండియన్ సినిమాల వరకే కాదు.. మొత్తంగా ఇండియన్ సినిమాలోనే అత్యధిక ప్రిమియర్ షో కలెక్షన్లు సాధించిన సినిమాగా ‘కబాలి’ నిలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాల్లో ‘కబాలి’ విడుదలవుతుండటం విశేషం. ఇప్పటిదాకా ఇండియన్ సినిమాలు రిలీజ్ కాని కొన్ని దేశాల్లో కూడా ‘కబాలి’ని రిలీజ్ చేస్తున్నారు. మలేషియా భాష మలాయ్ లోనూ కబాలి అనువదించిన సంగతి తెలిసిందే. జపాన్.. చైనా.. సింగపూర్ దేశాల్లో లోకల్ సినిమాల స్థాయిలో ‘కబాలి’ని భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 వేల స్క్రీన్లలో ‘కబాలి’ రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.