Begin typing your search above and press return to search.
కాపీ పబ్లిసిటీ ఏంటి కబాలీ!?
By: Tupaki Desk | 28 Jun 2016 4:21 PM GMTసూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి మూవీ.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండియన్ సినిమా. టీజర్ తో ఇండియాలో రికార్డులన్నీ తుడిచేసిన కబాలి.. సినిమాతో మరింతగా సెన్సేషన్స్ సృష్టించడం ఖాయమనే అంచనాలున్నాయి. రజినీకాంత్ ని రెండు దశాబ్దాల తర్వాత మాఫియా డాన్ రూపంలో చూసే అవకాశం కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించకపోయినా.. జూలై 15న ప్రపంచవ్యాప్తంగా కబాలి రిలీజ్ ఖాయమని ఇప్పటికే తేలిపోయింది.
అయితే సెన్సార్ కి సంబంధించి జూలై 1న సర్టిఫికేట్ తెచ్చుకున్నా.. ఈ డేట్ ని ప్రకటించనున్నారు. ఇప్పుడు కబాలి ప్రమోషన్స్ పీక్ స్టేజ్ కి చేరుకున్నాయి. ఇందులో భాగంగా విడుదల చేసిన ఒక పోస్టర్ ఇప్పుడు వివాదానికి కారణం అవుతోంది. ఇర్ఫాన్ ఖాన్ హీరోగా నటించిన మదారి పోస్టర్ ని పోలి ఉండడమే ఇందుకు కారణం. ఓ సిటీ పోస్టర్ ని నిలువుగా ఉంచి ఇర్ఫాన్ ముఖాన్ని ఆ నగరంలోంచి వచ్చినట్లుగా మదారి పోస్టర్ ఉంటుంది. సిటీని మాత్రం మార్చి అదే కాన్సెప్ట్ తో కబాలి పోస్టర్ డిజైన్ చేశారు. దీంతో కాపీ అంటూ ఆరోపణలు పెరిగిపోయాయి.
దీనికి నిర్మాతల నుంచి ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఆ పోస్టర్ అధికారికం కాదని... కేవలం ఫ్యాన్ మేడ్ పోస్టర్ అయుటుందని క్లారిఫికేషన్ ఇచ్చారు. మదారి నిర్మాతలు మాత్రం కబాలికి తమకు పోటీ లేదని.. రెండు సినిమాలు చూడాలని విజ్ఞప్తి చేయడం విశేషం.