Begin typing your search above and press return to search.
ఇంతకీ కబాలి ఎంత కలెక్ట్ చేసింది?
By: Tupaki Desk | 27 Oct 2016 7:30 PM GMT‘కబాలి’ కలెక్షన్లు 300 కోట్లని.. 500 కోట్లని రకరకాల వార్తలొచ్చాయి. నెగెటివ్ టాక్ తో మొదలైన సినిమాకు ఇంత కలెక్షన్లు ఏంటా అని అంతా ఆశ్చర్యపోయారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఎంత భారీగా జరిగినా ఈ కలెక్షన్లు అసాధ్యం అనే అన్నారంతా. తమిళ మీడియా తమ సినిమాను గొప్పగా చూపించే ప్రయత్నంలో ఇష్టానుసారం కలెక్షన్ల లెక్కల్ని ప్రచారం చేసినట్లు భావించారు అప్పట్లో. ఐతే ‘కబాలి 100 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ సినిమా కలెక్షన్లపై ఓ క్లారిటీ వచ్చింది. ట్రేడ్ వర్గాలు ‘కబాలి’ కలెక్షన్ల వివరాలు వెల్లడించాయి. ఇంతకీ ‘కబాలి’ ఎంత కలెక్ట్ చేసిందంటే..
‘కబాలి’ అన్ని భాషల్లో కలిపి వరల్డ్ వైడ్ రూ.287 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. షేర్ దాదాపు రూ.161 కోట్లు. ఇండియా వరకు రూ.100 కోట్ల షేర్.. రూ.186 కోట్ల గ్రాస్ వసూలైంది.తమిళనాట ఈ చిత్రం రూ.75 కోట్ల గ్రాస్.. రూ.46 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. తెలుగు వెర్షన్ రూ.36 కోట్ల గ్రాస్.. రూ.23 కోట్ల దాకా షేర్ వసూలు చేసినట్లు అంచనా. ఈ సినిమాకు బిజినెస్ రూ.200 కోట్లకు పైనే జరిగింది. తమిళ వెర్షన్ తమిళనాడు వరకు మంచి వసూళ్లే సాధించినా.. అక్కడే కాక అన్ని చోట్లా నష్టాలే మిగిల్చింది. తెలుగులో ‘కబాలి మీద రూ.32 కోట్ల దాకా పెట్టుబడి పెట్టారు. అంటే రూ.9 కోట్ల దాకా నష్టం తప్పలేదన్నమాట. సినిమా మీద పెట్టుబడితో పోలిస్తే ‘కబాలి’ నిరాశ పరిచినా.. ఓవరాల్ గా మాత్రం తమిళంలో ఇదే హైయెస్ట్ షేర్ కలెక్ట్ చేసిన సినిమా కావడం విశేషం. ‘రోబో’ కంటే కూడా దీనికే ఎక్కువ షేర్ వచ్చింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/