Begin typing your search above and press return to search.
కబాలి బిజినెస్.. కళ్లు తిరుగుతాయి
By: Tupaki Desk | 18 July 2016 11:07 AM GMTహిందీ సినిమాల కలెక్షన్ల లెక్కలు బయటికి వస్తుంటాయి కానీ.. వాటి బిజినెస్ గురించి ట్రేడ్ అనలిస్టులు బయటికి వెల్లడించరు. సౌత్ సినిమాల బిజినెస్ వివరాలు మాత్రం బయటికొస్తుంటాయి. ఇలా బయటికొచ్చిన సినిమాల బిజినెస్ లెక్కలతో పోల్చి చూస్తే ‘కబాలి’ ఇండియాలో అత్యధిక ప్రి రిలీజ్ చేసిన సినిమాగా చెప్పొచ్చు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.220 కోట్లకు పైగా బిజినెస్ చేయడం విశేషం. ఏ ఏరియాలో ఎవరు ఎంతకు కొన్నారన్న వివరాలు బయటికి వచ్చాయి. ఆ లెక్కలేంటో చూద్దాం పదండి.
జాజ్ సినిమాస్ అనే సంస్థ ‘కబాలి’ తమిళనాడు థియేట్రికల్ రైట్స్ ను రూ.68 కోట్లకు సొంతం చేసుకుంది. తెలుగు ‘కబాలి’ని షణ్ముగ ఫిలిమ్స్ రూ.32 కోట్లకు కొన్న సంగతి తెలిసిందే. అంటే తమిళనాడు-ఆంధ్రప్రదేశ్-తెలంగాణల్లోనే ఈ సినిమా రూ.100 కోట్లు సంపాదించేసిందన్న మాట. ‘కబాలి’ కర్ణాటక హక్కుల్ని ‘లింగా’ ప్రొడ్యూసర్ రాక్ లైన్ వెంకటేష్ తీసుకోవడం విశేషం. అతను ఇందుకోసం రూ.10 కోట్లు చెల్లించాడు. కేరళ హక్కులు రూ.7.5 కోట్లకు అమ్ముడయ్యాయి. నార్త్ ఇండియా మొత్తం కబాలి సినిమాను ఫాక్స్ స్టార్ సంస్థ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రైట్స్ రూ.15 కోట్లు పలికాయి. అమెరికా-కెనడా రైట్స్ రూ.8.5 కోట్లకు.. మిగతా ఓవర్సీస్ హక్కులన్నీ కలిపి రూ.16.5 కోట్లకు అమ్మినట్లు సమాచారం. శాటిలైట్.. మ్యూజిక్ హక్కుల్ని రూ.40 కోట్లకు అమ్మారట. ఇతర మార్గాల్లో రూ.15 కోట్ల దాకా వచ్చాయి. మొత్తంగా కబాలి ప్రి రిలీజ్ బిజినెస్ రూ.220 కోట్లు దాటినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎంత వసూలు చేస్తుందో చూడాలి.