Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ: ‘కబాలి’
By: Tupaki Desk | 22 July 2016 9:17 AM GMTచిత్రం : ‘కబాలి’
నటీనటులు: రజినీకాంత్ - రాధికా ఆప్టే - ధన్సిక - విన్ స్టన్ చావో - జాన్ విజయ్ - నాజర్ - దినేష్ - కలైయరసన్ - కిషోర్ తదితరులు
సంగీతం: సంతోష్ నారాయణన్
ఛాయాగ్రహణం: జి.మురళి
నిర్మాతలు: ప్రవీణ్ - కేపీ చౌదరి
రచన - దర్శకత్వం: పా.రంజిత్
ఒక సినిమా విడుదల ఒక పెద్ద పండుగలా మారిపోవడం.. అరుదుగా జరుగుతుంటుంది. గత ఏడాది ‘బాహుబలి’ విషయంలో అదే జరిగింది. ఇప్పుడు ‘కబాలి’కి కూడా అదే జరుగుతోంది. టీజర్ రిలీజైన నాటి నుంచి ‘కబాలి’ మీద అంతకంతకూ పెరుగుతూ వచ్చిన అంచనాలు ఇప్పుడు ఆకాశాన్ని కూడా దాటి పైకెళ్లిపోయాయి. ఉత్కంఠకు.. నిరీక్షణకు తెరదించుతూ ఈ రోజే ‘కబాలి’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇంతకీ ఏముందో ఈ ‘కబాలి’లో చూద్దాం పదండి.
కథ:
మలేషియా జైల్లో పాతికేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి బయటికి వస్తాడు కబాలి (రజనీకాంత్). అతడి కోసం వేలాది మంది ఆశగా ఎదురు చూస్తుంటారు. కబాలి బయటికి రాగానే అతడి అనుచరులు.. అభిమానులు బ్రహరథం పడతారు. డ్రగ్ మాఫియా చేతుల్లో చిక్కి బాధపడుతున్న వాళ్లందరి జీవితాల్లో కబాలి రాకతో మళ్లీ కొత్త వెలుగు వస్తుంది. ప్రత్యర్థుల్లో దడ మొదలవుతుంది. ఇంతకీ కబాలిని అంతమంది ఎందుకు అభిమానిస్తారు.. ప్రత్యర్థులకు అతనంటే ఎందుకంత భయం.. ఇంతకీ అతడి గతమేంటి.. కబాలి జైలుకు వెళ్లాక అతడి కుటుంబం ఏమైంది.. బయటికొచ్చాక తిరిగి తన కుటుంబ సభ్యుల్ని అతను కలుసుకున్నాడా.. ప్రత్యర్థులు అతణ్ని దెబ్బ తీయడానికి ఏం చేశారు.. కబాలి వారిని ఎలా ఎదుర్కొన్నాడు.. ఈ విషయాలన్నీ తెరమీదే చూసి తెలుసుకోవాలి.
కథనం - విశ్లేషణ:
కబాలి టీజర్ మత్తుతో థియేటర్లోకి అడుగుపెడితే కష్టం. ఆ మత్తు ఓ పావుగంటకే వదిలిపోతుంది. ఇంకాస్త సమయం గడిచాక ఇంకో రకమైన ‘మత్తు’ ఆవహిస్తుంది. ఆ మత్తు మధ్యలో ఇంటర్వెల్ దగ్గరా.. చివర్లో క్లైమాక్స్ దగ్గర మాత్రమే కాస్త వదులుతుంది. మిగతా సమయమంతా ఆ మత్తులోనే జోగుతుంటాం. రజినీ అభిమానులు ఆశించే గూస్ బంప్స్ మూమెంట్స్ ఆరంభంలో పరిచయ సన్నివేశాలు.. చివర్లో వచ్చే క్లైమాక్స్ వరకే పరిమితం. మధ్యలో నడిచేదంతా చూస్తుంటే తీరిగ్గా ఒక మాఫియా డాన్ ఆత్మకథ చదువుతున్న ఫీలింగ్ కలుగుతుంది. సూపర్ స్టార్ సినిమా కదా.. ఆయన వీరత్వాన్ని చూసి ఊగిపోదాం.. పంచ్ డైలాగులకు విజిల్స్ కొడదాం.. విలన్లను ఉతికారేస్తుంటే ఎగిరి గంతేద్దాం.. రజినీ మార్కు మేనరిజమ్స్ ఆస్వాదిస్తూ కేరింతలు కొడదాం అనుకుంటే మాత్రం నిరాశ తప్పదు.
రజినీకాంత్ అంటే జనాలు బాగా ఇష్టపడేది ఆయన స్పీడ్ చూసి. ఆయన్ని ఓ సూపర్ హీరోలాగా ఉండాలని ఆశిస్తారు. ఐతే ‘కబాలి’లో మాత్రం రజినీ చాలా నీరసంగా కనిపిస్తాడు. తెరమీద తన భార్యను వెతకడానికి దాదాపు ముప్పావుగంట సమయం తీసుకుంటాడు. రజినీ సినిమాలో ఇంత నీరసంగా సా....గే ఎపిసోడ్ ను ప్రేక్షకులు ఊహించరు. ఒక వ్యక్తి పాతికేళ్ల తర్వాత తన భార్యను చూసే క్రమంలో ఎలాంటి భావోద్వేగాలకు గురవుతాడో హృద్యంగా చెప్పాలన్న పా.రంజిత్ ఆలోచన బాగానే ఉంది. కానీ రజినీకాంత్ సినిమాలో ఇలాంటి ఎపిసోడ్ పెట్టడం.. అది కూడా ఏ ప్రత్యేకతా లేకుండా నిస్సారంగా అంతసేపు ఈ వ్యవహారాన్ని నడిపించడం.. ఆ ఎపిసోడ్ ను అంత సేపు సాగదీస్తే తప్ప భావోద్వేగాలు పండవని దర్శకుడు భావించడంతోనే వచ్చింది సమస్య. అసలే రజినీ మార్కు హీరోయిజం లేదని నిరుత్సాహంతో ఉన్న ప్రేక్షకులు.. ఈ ఎపిసోడ్ తర్వాత పూర్తిగా నీరసించిపోతారు. ప్రి క్లైమాక్స్.. క్లైమాక్స్ లో కొంత ఊపు ఉన్నా.. రజినీ తనదైన శైలిలో ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేసినా.. అప్పటిదాకా ఆవహించిన నీరసం వదలడం కష్టమే అవుతుంది.
రజినీకాంత్ సినిమాలంటే ఒక వేగం ఉండాలని ఆశిస్తారు ప్రేక్షకులు. ఆయన్నుంచి ప్రధానంగా ఆశించేది వినోదాన్నే. ఐతే రజినీకాంత్ సంగతి పక్కనబెట్టేస్తే.. మామూలుగా చూసుకున్నా ‘కబాలి’ వేగాన్ని తట్టుకోవడం కష్టం. నిజానికి తెరమీద రజినీని చూస్తూ అంతో ఇంతో ఎంగేజ్ అవుతాం.. దర్శకుడిని మన్నిస్తాం కానీ.. విషయం లేకుండా ఊరికే సాగదీసిన ఈ కథాకథనాలతో మరో హీరో ఈ సినిమా చేసి ఉంటే భరించడం చాలా చాలా కష్టమయ్యేది. నరేషన్ స్లో అయినా పర్వాలేదు.. కనీసం ఆసక్తికరమైన సన్నివేశాలైనా ఉండాలి కదా. కానీ ‘కబాలి’లో అలాంటి సన్నివేశాలు పరిమితం.
అసలు కథానాయకుడి పాత్రనే సరిగా తీర్చిదిద్దలేదు రంజిత్. కబాలి అంత గొప్పవాడు.. ఇంత గొప్పవాడు అని మాటలతో చెప్పేస్తే సరిపోతుందా..? అతడి గొప్పదనాన్ని చాటిచెప్పే బలమైన సన్నివేశాలే పడలేదు. ప్రథమార్ధంలో ఫ్లాష్ బ్యాక్ ను నరేట్ చేసిన తీరు విసుగుపుట్టిస్తుంది. ఒకేసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోకుండా ఇక్కడ జనాలు అర్థరహితమైన ప్రశ్నలు వేయడం.. దానికి రజినీ సమాధానాలు చెప్పడంతో ఆ ఎసిసోడ్లో ఇంటెన్సిటీ కనిపించదు. రజినీ ఇంట్రడక్షన్.. ఆ తర్వాత వచ్చే ఫైట్ తో ‘కబాలి’ అంచనాలకు తగ్గట్లే సాగేలా కనిపిస్తుంది కానీ.. ఆ తర్వాత కథనం నెమ్మదిగా సాగుతూ ప్రేక్షకులకు నీరసం తెప్పిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఆసక్తి రేకెత్తించదు. ఇంటర్వెల్ ముందు ట్విస్టు.. యాక్షన్ ఎపిసోడ్ బాగున్నాయి. కానీ ద్వితీయార్ధంలో కథానాయకుడు భార్య వెతుక్కుంటూ వెళ్లే ఎసిపోడ్ మళ్లీ ఉత్సాహాన్ని నీరుగార్చేస్తుంది. పరిచయ సన్నివేశాల్లో కనిపించిన ఎనర్జిటిక్ రజినీ.. తిరిగి చివరి అరగంటలో పునర్దర్శనం ఇచ్చి కొంత వరకు వినోదాన్నందిస్తాడు.
సినిమాను ముగించిన తీరును బట్టి.. రంజిత్ కు ఈ సినిమా తీయడంలో ఒక మంచి ఉద్దేశం ఉందని.. తన ఐడియాలజీని రజినీ ద్వారా ఎక్కువమందికి చెప్పాలని అతను భావించాడని అర్థమవుతుంది. ఐతే రజినీ లాంటి సూపర్ స్టార్ ను సరిగ్గా వాడుకోవడంలో అతను విఫలమయ్యాడు. అతడి ఉద్దేశమూ నెరవేరలేదు. ప్రేక్షకులూ రజినీ నుంచి ఆశించే వినోదాన్నీ పొందలేకపోయారు. ‘కబాలి’ నేపథ్యం.. అందులో కనిపించే పాత్రలు.. నటీనటులు.. రజినీ చెప్పే కొన్ని డైలాగులు.. మిగతా అంశాలన్నీ కూడా తమిళ నేటివిటీతో ముడిపడి ఉండటం మన ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు. తమిళ ప్రేక్షకులకు ‘కబాలి’ మెరుగ్గా అనిపించే అవకాశాలున్నాయి కానీ.. మన ప్రేక్షకులు మాత్రం చాలావరకు నిరాశకు గురయ్యే అవకాశముంది.
నటీనటులు:
రజినీకాంత్ తన వంతుగా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నం చేశాడు. పరిచయ సన్నివేశాల్లో రజినీ మెస్మరైజ్ చేశాడు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతం. క్లైమాక్స్ లో కూడా అదరగొట్టాడు. పాతికేళ్ల తర్వాత తన భార్యను కలుసుకోబోయేముందు.. కలిశాక కలిగే భావోద్వేగాల్ని రజినీ బాగా పండించాడు. ఇక్కడే ఆయన ఎంత మంచి నటుడో తెలుస్తుంది. ఐతే రజినీ ఉత్సాహంగా ఉన్నపుడే ప్రేక్షకుడిలోనూ ఉత్సాహం ఉంటుంది. ఆయన డల్లుగా ఉంటే ప్రేక్షకుడికీ నీరసం వచ్చేస్తుంది. సినిమాలో మెజారిటీ పార్ట్ అదే జరిగింది. హీరోయిన్ రాధికా ఆప్టే.. రజినీ భార్య పాత్రకు చక్కగా కుదిరింది. ఐతే ఆమె టాలెంటుని దర్శకుడు సరిగా వాడుకోలేదు. ఐతే తెరపై కనిపించిన ప్రతిసారీ రాధిక ఆకట్టుకుంది. రజినీ కూతురిగా నటించిన ధన్సిక బాగానే చేసింది. ఐతే తల్లిని కలుసుకోబోయే ముందు ఉండే ఎమోషన్ ఏదీ ఆమె ముఖంలో కనిపించదు. ఇది దర్శకుడి తప్పిదమే.
విలన్ విన్ స్టన్ చావో బాగా చేశాడు. అతడి ముఖంలో కాఠిన్యం కనిపిస్తుంది. కానీ దర్శకుడు ఈ పాత్రను కూడా సరిగా తీర్చిదిద్దలేదు. మిగతా ప్రధాన పాత్రధారులంతా చాలా వరకు మనకు పెద్దగా పరిచయం లేని తమిళులే. వాళ్ల గురించి చెప్పడానికే పెద్దగా ఏం లేదు.
సాంకేతికవర్గం:
‘కబాలి’ సినిమాలో పూర్తి సంతృప్తినిచ్చే విషయం అంటే అది సంగీతమే. సంతోష్ నారాయణన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సూపర్బ్. సినిమా స్థాయికి మించిన సంగీతాన్నందించాడతను. సన్నివేశం ఎలా ఉంది.. ఎంత ఆసక్తి ఉంది అన్నది పక్కనబెట్టేస్తే సంతోష్ మాత్రం టాప్ క్లాస్ రీరికార్డింగ్ అందించాడు. ఐతే చాలా సన్నివేశాల్లో విషయం లేక అతి ప్రతిభ పనికిరాకుండా పోయింది. నిప్పురా థీమ్ మ్యూజిక్ సినిమాలో చెప్పుకోదగ్గ అతి పెద్ద విశేషం. పాటలు కూడా బాగానే ఉన్నాయి. జి.మురళి ఛాయాగ్రహణం కూడా బాగుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. దర్శకుడు పా.రంజిత్.. రజినీ ఎనర్జీని వాడుకునే కథాకథనాలు రాసుకోలేకపోయాడు. మరీ నెమ్మదిగా సాగే స్క్రీన్ ప్లే సినిమాకు పెద్ద మైనస్. రంజిత్ నరేషన్ డెడ్ స్లో. రజినీతో అందరూ చేసేది కాక.. ఒక క్లాసిక్ తీయాలని అతను భావించినట్లున్నాడు. కానీ ఆ ప్రయత్నంలో విఫలమయ్యాడు. ఇటు వినోదమూ లేకపోయింది. అటు సినిమా క్లాసిక్ కూడా అవలేదు.
చివరగా: కబాలి.. సూపర్ స్టార్ నీరసావతారం
రేటింగ్: 2.25/5
Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre