Begin typing your search above and press return to search.

తెలుగు కబాలి.. అన్ని ఏరియాల్లోనూ..

By:  Tupaki Desk   |   13 Aug 2016 10:30 PM GMT
తెలుగు కబాలి.. అన్ని ఏరియాల్లోనూ..
X
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి ఎన్నెన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ్ అంతో ఇంతో పర్లేదనిపించిన ఈ సినిమా.. తెలుగులో మాత్రం పూర్తిగా నిరాశ పరిచింది. పబ్లిసిటీ గందరగోళం.. అడ్వాన్స్ బుకింగ్ ల మాయాజాలంతో మొదటి వీకెండ్ స్ట్రాంగ్ గా కనిపించిన ఈ చిత్రానికి.. ఆ తర్వాత మాత్రం వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఇప్పుడు కబాలి ఫుల్ రన్ పూర్తయిపోయింది. అన్ని ఏరియాల్లోనూ కబాలి కథ కంప్లీట్ అయిపోయింది.

ఫుల్ రన్ లో కబాలి తెలుగు వెర్షన్ కి వచ్చిన వసూళ్లు 22.05 కోట్ల రూపాయలు. నైజా ఏరియా నుంచి 9 కోట్ల వసూళ్లు దక్కగా.. సీడెడ్ లో 3.5 కోట్లు.. ఉత్తరాంద్రలో 2.3 కోట్లు.. గుంటూరు 1.9 కోట్లు.. ఈస్ట్ 1.75 కోట్లు.. వెస్ట్ 1.36 కోట్లు.. కృష్ణా కోటిన్నర.. నెల్లూరులో 0.74 కోట్ల షేర్ వసూలు చేయగలగింది కబాలి. డబ్బింగ్ బొమ్మకి అంకెలు బాగానే కనిపిస్తున్నా.. డిస్ట్రిబ్యూటర్లకు అమ్మిన రేట్ల ప్రకారం చూస్తే ఇది పక్కా లాస్ వెంచర్ అని అర్ధమైపోతుంది.

నైజాంలో 10 కోట్లకు కొంటే.. 9 కోట్ల వసూళ్లతో కోటి రూపాయల లాస్ మిగిల్చింది. ఇదొక్కటే కాస్త పర్లేదనిపించే ఫిగర్. సీడెడ్ రైట్స్ ను 6.5 కోట్లకు అమ్మితే.. 3 కోట్ల నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. కోస్తా ఏరియాలో 15 కోట్లకు గాను 5.5 కోట్ల నష్టాలు వచ్చాయి. రజినీకాంత్ గత రెండు చిత్రాలు కొచ్చాడయాన్ - లింగాలకు.. కబాలి కలిపి డిజాస్టర్ల హ్యాట్రిక్ పూర్తయిపోయింది. డిస్ట్రిబ్యూటర్లను మరోసారి రజినీ మూవీ ముంచేసింది.