Begin typing your search above and press return to search.
ఇవాళే సెన్సార్ కి పంపుతున్నారట
By: Tupaki Desk | 11 July 2016 4:24 AM GMTసూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ కబాలి కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురచూస్తున్నారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని ఈ చిత్రం.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం కారణంగా విడుదల లేట్ అయింది. సినిమాలోని స్టిల్స్ ఫ్యాన్స్ లో ఆసక్తిని మరింతగా పెంచేశాయి.
జూలై 1న విడుదల కావాల్సి ఉన్న కబాలి.. కొన్ని గ్రాఫిక్ సీన్స్ కోసం జూలై 15కు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు నిర్మాతలు. ఇప్పుడు ఆ డేట్ కి కూడా కబాలి రావడం కష్టమే అని అర్ధమైపోయింది. ఇలాంటి సమయంలో ఆగస్ట్ 15న రిలీజ్ డేట్ అంటూ ప్రచారం మొదలవగా.. నిర్మాతలు మాత్రం జూలై 22కే కట్టుబడ్డారనే టాక్ వినిపిస్తోంది. మరో పది రోజుల సమయం మాత్రమే ఉండడంతో.. ఇప్పుడీ మూవీని సెన్సార్ దగ్గరకు పంపనున్నారు.
ఇప్పటికే సెన్సార్ సభ్యులు చూసేశారని.. సర్టిఫికేట్ తీసుకోవడం ఒకటే పెండింగ్ అనే టాక్ వినిపిస్తున్నా.. నిర్మాతలు దీన్ని ఖండించారు. రిలీజ్ డేట్ పై మాత్రం సెన్సార్ బోర్డ్ నుంచి సర్టిఫికేట్ అందుకున్నాకే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయనున్నారు.