Begin typing your search above and press return to search.
మన కబాలి ముందు.. వాళ్ల కబాలి జుజుబి
By: Tupaki Desk | 17 July 2016 7:50 AM GMTరజినీకాంత్ బేసిగ్గా తమిళ కథానాయకుడు. కానీ తెలుగులో కూడా ఆయన క్రేజ్ తక్కువేమీ కాదు. మన ప్రేక్షకులు ఇక్కడి స్టార్ హీరోలతో సమానంగా ఆయన్ని చూస్తారు. ఆయన సినిమాల్ని ఆదరిస్తారు. తెరమీద సూపర్ స్టార్ ను చూసి పూనకం తెచ్చుకుంటారు. ఇక రజినీ కొత్త సినిమా ‘కబాలి’ విషయంలో మన ఆడియన్స్ ఎంత ఉత్సాహంగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మన స్టార్ హీరోలకు సైతం కన్ను కుట్టే స్థాయిలో ఈ సినిమాకు బిజినెస్ జరిగింది. రిలీజ్ కూడా అంతే భారీగా ఉండబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాను దాదాపు 1400-1500 థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. చాన్నాళ్లుగా తెలుగులో పెద్ద సినిమాల సందడి లేకపోవడంతో ప్రేక్షకులు ఆవురావురుమని ఉన్నారు. మూడు నాలుగు వారాలుగా థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఇలాంటి టైంలో ‘కబాలి’ భారీ హైప్ మధ్య రిలీజవుతుండటంతో ఆ హైప్ ను క్యాష్ చేసుకోవడం కోసం మాగ్జిమం థియేటర్లలో ఆ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.
ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. తెలుగుతో పోలిస్తే తమిళంలో ఈ సినిమా సగం థియేటర్లలోనే రిలీజవుతోంది. తమిళనాట మనతో పోలిస్తే థియేటర్లు చాలా తక్కువ. మనకున్న వాటిలో సగం థియేటర్లు కూడా ఉండవక్కడ. అందుకే ఎంత భారీ సినిమా అయినాసరే.. 700-800 థియేటర్లలో మాత్రమే రిలీజవుతుంది. ‘కబాలి’ పరిస్థితి కూడా అంతే. హైదరాబాద్ సిటీలో ‘కబాలి’ తొలి రోజు వందకు పైగా స్క్రీన్లలో రిలీజయ్యే అవకాశముంది. ఐతే చెన్నైలో ఈ సినిమా 65 స్క్రీన్లలో మాత్రమే రిలీజవుతోంది. దానికే వామ్మో అనుకుంటున్నారు. ఓ తమిళ సినిమా చెన్నైలో ఇన్ని థియేటర్లలో రిలీజవడం రికార్డట. రజినీ స్టయిల్లో చెప్పాలంటే.. తెలుగు కబాలి ముందు తమిళ కబాలి జుజుబి అన్నమాట.