Begin typing your search above and press return to search.

‘కబాలి’ని అక్కడ ఎలా ప్రమోట్ చేస్తున్నారంటే..

By:  Tupaki Desk   |   3 Jun 2016 1:30 PM GMT
‘కబాలి’ని అక్కడ ఎలా ప్రమోట్ చేస్తున్నారంటే..
X
వరుసగా రెండు డిజాస్టర్లు ఇచ్చినా సరే.. సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రభ ఏమాత్రం తగ్గలేదు సరి కదా.. ఇంకా పెరిగింది. ‘కబాలి’కి వస్తున్న బిజినెస్ ఆఫర్స్.. ఆ సినిమాను రిలీజ్ చేయబోతున్న దేశాలు.. థియేటర్ల సంఖ్య చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 దేశాల్లో.. దాదాపు 6 వేల థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు అంచనా. కేవలం విదేశాల్లో తమిళ.. తెలుగు వెర్షన్లను రిలీజ్ చేయడమే కాదు.. ఆయా దేశాల ప్రాంతీయ భాషల్లోకి అనువదించి మరీ ‘కబాలి’ని రిలీజ్ చేస్తుండటం విశేషం. ఎప్పట్లాగే జపాన్ లో రజినీ సినిమా లోకల్ లాంగ్వేజ్ లో విడుదవుతోంది. దీంతో పాటు తొలిసారి మలేషియా స్థానిక భాష ‘మలాయ్’లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండటం విశేషం. ఇప్పటికే డబ్బింగ్ వర్క్ కూడా పూర్తయింది.

మలాయ్ లో అనువాదమైన తొలి ఇండియన్ సినిమా ఇదే కావడం విశేషం. ఏదో మొక్కుబడిగా సినిమాను మలేషియా భాషలో అనువదించి రిలీజ్ చేయడం కాకుండా.. అక్కడ పెద్ద ఎత్తున ప్రమోషన్లు కూడా చేస్తున్నారు. మలేషియాలోని కొన్ని ప్రధాన నగరాల్లో తిప్పడం కోసం ‘కబాలి’ ప్రమోషన్ వెహికల్స్ కూడా సిద్ధం చేయడం విశేషం. ఈ వాహనాలచుట్టూ కబాలి పోస్టర్లు అంటించి.. మలాయ్ భాషలోనూ విడుదల చేస్తున్నట్లు.. జులై 1న విడుదల కాబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ సినిమాలో నటించిన మలేషియా నటీనటుల ఫొటోలు కూడా పోస్టర్లో ఉన్నాయి. ఒక ఇండియన్ మూవీని మరో దేశంలో ఈ స్థాయిలో ప్రమోట్ చేయడం మామూలు విషయం కాదు. విడుదల తర్వాత సూపర్ స్టార్ ఇంకెంత సంచలనం సృష్టిస్తాడో చూడాలి.