Begin typing your search above and press return to search.
బాలీవుడ్ పై కబీర్ బేడీ సంచలన వ్యాఖ్యలు..!
By: Tupaki Desk | 10 April 2021 8:30 AM GMTచిత్ర పరిశ్రమలో నెపోటిజం పెరిగిపోయిందని తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. బాలీవుడ్ సీనియర్ నటుడు కబీర్ బేడీ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఆయన రాసిన పుస్తకం ఐ మస్ట్ టెల్ ను లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హాజరయ్యారు.
బాలీవుడ్ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు కబీర్ బేడీ. తనదైన నటనతో అద్భుతాలు చేశారు. అమెరికా, లండన్ లో కూడా తనదైన ముద్రవేశారు. తన అనుభవ సారాన్ని పుస్తకరూపంలోకి తెచ్చిన కబీర్.. ఈ సందర్భంగా తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నారు.
తాను నటుడిగా ఉన్నతికి చేరుకున్నప్పటికీ.. బాలీవుడ్ తనకు ఆ పాత్రలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఆ పాత్రల కోసం ఎదురు చూస్తూనే ఉండిపోయానని వాపోయారు. చివరకు తన టాలెంట్ దేశం బయటే చూపించాల్సి వచ్చిందని ఆవేదన చెందారు.
తన విజయాలను, జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లను ఈ పస్తకంలో వెల్లడించినట్టు చెప్పారు. వర్చువల్ గా జరిగిన ఈ ఆవిష్కరణలో సల్మాన్ మాట్లాడుతూ.. ఈ బుక్ లో నేటితరం నేర్చుకునే విషయాలు చాలా ఉంటాయని భావిస్తున్నట్టు చెప్పారు. కాగా.. కబీర్ బేడీ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆస్తుల విషయంలోనూ కుటుంబంలో కలతలు వచ్చాయి. మరి, ఈ పుస్తకంలో ఎలాంటి అంశాలకు చోటిచ్చారో చూడాల్సి ఉంది.