Begin typing your search above and press return to search.
బాలీవుడ్ టాప్ 10లో కబీర్ సింగ్
By: Tupaki Desk | 10 July 2019 2:30 PM GMTజాతీయ మీడియాలో ఓ సెక్షన్ మీడియా నెగెటివ్ రివ్యూలతో విరుచుకుపడినా అన్నిటికీ చెక్ పెడుతూ `కబీర్ సింగ్` సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమా అర్జున్ రెడ్డి కి రీమేక్ గా తెరకెక్కిన కబీర్ సింగ్ బాలీవుడ్ టాప్ 10 బాక్సాఫీస్ హిట్స్ లో ఒకటిగా నిలవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. షాహిద్ కెరీర్ లో మరపు రాని అద్భుత చిత్రంగా రికార్డుల్ని తిరగరాస్తోంది.
కబీర్ సింగ్ 250 కోట్ల నెట్ క్లబ్ లో చేరేందుకు కూతవేటు దూరంలో మాత్రమే ఉంది. ఇప్పటికే 243 కోట్ల మేర నెట్ వసూళ్లను సాధించింది. ఇంకా వసూళ్ల పరంగా దూకుడును కొనసాగిస్తోంది. బాహుబలి 2 - దంగల్ చిత్రాలు బాలీవుడ్ టాప్ 1.. టాప్ 2 చిత్రాలుగా రికార్డుల్లో నిలవగా కబీర్ సింగ్ టాప్ 10 సినిమాగా చరిత్రకెక్కింది. సంజు- పీకే- టైగర్ జిందా హై- భజరంగి భాయిజాన్- పద్మావత్- సుల్తాన్- ధూమ్ 3 చిత్రాలు టాప్ 10లో చోటు దక్కించుకున్న ఇతర సినిమాలు. షాహిద్ నటించిన వాటిలో 100 కోట్ల క్లబ్ సినిమాలు ఉన్నా.. వాటన్నిటినీ మించి కబీర్ సింగ్ సంచలనాలు సృష్టిస్తోంది. ఖాన్ ల త్రయానికే మతిచెడేలా అద్భుత వసూళ్లతో ఈ సినిమా దూసుకెళ్లిపోతుండడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇంతటి సెన్సేషనల్ హిట్ కి తెలుగు కుర్రాడు సందీప్ వంగా దర్శకత్వం వహించడం ఆసక్తికరం.
`కబీర్ సింగ్` కి రకరకాల వివాదాలు ఆయాచిత వరంగా మారాయి. ఇప్పటికే ఈ సినిమాపై క్రిటిక్స్ నెగెటివ్ టాక్ ని స్ప్రెడ్ చేయడం.. మహిళా మండళ్లు విరుచుకుపడడం వగైరా హాట్ టాపిక్ గా మారాయి. క్రిటిక్స్ తీరుపై సందీప్ వంగా చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. ఓవరాల్ గా కబీర్ సింగ్ కి కావాల్సినంత ప్రచారం దక్కింది. గురూజీ రామ్ గోపాల్ వర్మ బాటలో వివాదంతో ప్రచారం చేసుకుని బాక్సాఫీస్ మైలేజ్ పెంచడం హాట్ టాపిక్ గా మారింది. ప్రేమలో విఫలమై డ్రగ్స్- ఆల్కహాల్ కి అడిక్ట్ అయిన ఓ యువ డాక్టర్ లైఫ్ జర్నీతో తెరకెక్కించిన అర్జున్ రెడ్డి తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్. అంతకుమించి కబీర్ సింగ్ బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.