Begin typing your search above and press return to search.
జిల్ విలన్ కు హ్యాండిచ్చారుగా...
By: Tupaki Desk | 21 Aug 2015 11:40 AM GMTగోపిచంద్ 'జిల్' సినిమాతో కబీర్ సింగ్ అనే విలన్ ఒకడున్నాడని తెలుగు ప్రేక్షకులకు తెలిసింది. ప్రదీప్ రావత్ కి ఉన్నంత భీకరమైన అప్పియరెన్స్ ఈ యంగ్ విలన్ లో ఉంది. టాలీవుడ్ లో మంచి భవిష్యత్ ఉందని అప్పట్లో అంతా పొగిడేశారు. జిల్ చిత్రంలో అతడి పెర్ఫామెన్స్ అల్టిమేట్. అతడిలోని స్టామినాని బైటికి తెచ్చే క్యారెక్టర్ పడాలే కానీ, అదిరిపోయే విలనీ అతడిలో ఉందని విమర్శకులంతా పొగిడేశారు.
అందుకే కబీర్ సింగ్ 'కిక్2'లో విలనీ చేశాడు అనగానే జనాలు ఓ కంట కనిపెట్టి ఉంచారు. కిక్2 ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. అయితే ఈ చిత్రంలో కబీర్ సింగ్ క్యారెక్టర్ కేవలం కొద్ది నిమిషాల్లో అంతమయ్యేదే. అతడి క్యారెక్టర్ ని ఎలివేట్ చేసిన తీరు అంత సందర్భోచితం అనిపించలేదు. ఆ రేంజు విలన్ కి ఈటైపు అండర్ షేడ్ క్యారెక్టర్ ఇస్తారా? అనిపించింది. విలనీ నిరూపించుకోవాలంటే పేదింటి అమ్మాయిని రేప్ చేసి చంపేయాలా? హీరోని ఎదిరించడానికని వెళ్లి చావుదెబ్బలు తిని పడిపోవాలా? అది స్క్రిప్టు లోని ఫాల్ట్ అయ్యి ఉండొచ్చు.
కబీర్ లోని క్రూరత్వాన్ని, చేతకానితనాన్ని ఆవిష్కరించడానికి దర్శకుడికి అంతకంటే గొప్ప ఆలోచన రాలేదనే అనుకోవాలి. ఒక ప్రాంతాన్ని గడగడలాడించే వాని కొడుకు మరీ ఇంత పల్చగా ఉంటాడా అనిపించింది. జస్ట్ స్క్రిప్టు లోని ఎర్రర్ అంతే. కబీర్ లోని ఒరిజినాలిటీ అది కానేకాదు. ప్రస్తుతానికి ఈ జిల్ విలన్ కు హ్యాండిచ్చారులే కాని, కబీర్ స్టామినాకి తగ్గ క్యారెక్టర్లు మునుముందు పుట్టాలని కోరుకుందాం.