Begin typing your search above and press return to search.
చూసిన సినిమానే మళ్ళీ చూడాలా..?
By: Tupaki Desk | 10 Nov 2022 7:30 AM GMTKGF మూవీ కన్నడ చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచిందనడంలో సందేహం లేదు. ఇది మిగతా హీరోలు మరియు ఫిలిం మేకర్స్ కు పాన్ ఇండియా సినిమాలు చేయగలమనే ధైర్యాన్ని ఇచ్చింది. ఈ నేపధ్యంలో వచ్చిన మరికొన్ని కన్నడ చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచనలం సృష్టించాయి.
చార్లీ 777 - విక్రాంత్ రోనా - కాంతారా వంటి సినిమాలు జాతీయ స్థాయిలో ప్రభావం చూపించాయి. ఈ క్రమంలో "కబ్జా" అనే మరో పాన్ ఇండియా మూవీ రాబోతోంది. అగ్ర హీరోలు ఉపేంద్ర - కిచ్చా సుదీప్ తొలిసారి కలిసి నటించిన చిత్రమిది. ఇందులో శ్రియా శరణ్ - మనోజ్ బాజ్పాయ్ వంటి పలువురు బిగ్ స్టార్స్ భాగమయ్యాయి.
ఆర్.చంద్రు దర్శకత్వంలో గ్యాంగ్ స్టర్ కథాంశంతో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా భారీ బడ్జెట్ తో "కబ్జా" చిత్రం తెరకెక్కుతోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఒరియా, మరాఠీ వంటి పలు ప్రధాన భారతీయ భాషల్లో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటికే "కబ్జా" సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టీజర్ రిలీజ్ అయ్యాయి. అయితే ప్రమోషనల్ కంటెంట్ కేజీఎఫ్ సినిమాను తలపిస్తూ ఉండటంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. టీజర్ లో దాదాపు ప్రతి విజువల్ మరియు ఫ్రేమ్ కూడా KGF ని గుర్తు చేసేలా ఉన్నాయంటో కామెంట్స్ చేశాడు.
1942 బొగ్గు గనుల సెటప్ - సినిమాటోగ్రఫీ - బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - ఎలివేషన్స్ - మదర్ సెంటిమెంట్ - గ్రాండియర్.. ఇలా ప్రతీ అంశం కబ్జా చిత్రాన్ని కెజిఎఫ్ తో పోల్చడానికి అవకాశమిచ్చాయి. ఉపేంద్ర ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో పాటు రౌడీల మధ్యలో నుంచి అతడు ఎంట్రీ ఇచ్చే సీన్ కూడా కేజీఎఫ్ ను గుర్తుకు తెచ్చింది.
కబ్జా అనేది రాఖీ భాయ్ లేని 'కేజీఎఫ్ 3' అని నెటిజన్లు పేర్కొన్నాడు. రెండు సినిమాల టీజర్లను పక్కనపెట్టిన ఎడిట్ చేసి విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో చూసినా సినిమానే మళ్లీ తీస్తే.. జనాలు మళ్ళీ చూడాలా అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.
KGF తో ఈ పోలికలు "కబ్జా" మేకర్స్ ను ఇబ్బంది పెడుతున్నాయని కామెంట్స్ వస్తున్నాయి. ఏమాత్రం తేడా కొట్టినా భారీ నష్టాలు తప్పవని బయ్యర్లు ఆలోచిస్తున్నారట. ఈ నేపథ్యంలో రిలీజ్ డేట్ విషయంలో నిర్మాతలు తర్జన భర్జనలు పడుతున్నారని అంటున్నారు.
క్రిస్మస్ స్పెషల్ గా డిసెంబర్ లో "కబ్జా" సినిమా వస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు విడుదల తేదీని లాక్ చేయాలా వద్దా అనే కన్ఫ్యూజన్ లో పడ్డారని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి త్వరలోనే మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ తో అన్నిటికీ క్లారిటీ ఇస్తారేమో చూడాలి. లగడపాటి శ్రీధర్ సమర్పణలో చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
aనోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.