Begin typing your search above and press return to search.

క‌బ్జా టీజ‌ర్ టాక్: మ‌రో కేజీఎఫ్ లా ఉందే?

By:  Tupaki Desk   |   24 Oct 2022 7:03 AM GMT
క‌బ్జా టీజ‌ర్ టాక్: మ‌రో కేజీఎఫ్ లా ఉందే?
X
'కేజీఎఫ్'..'బాహుబ‌లి' లాంటి సినిమాల త‌ర్వాత‌ ఇండియ‌న్ సినిమా మేకింగ్ స్టాండ‌ర్స్డ్ మారాయి. ఓ కొత్త ఫార్మెట్ లోకి వెళ్లాం. ఆ రెండు చిత్రాల స్పూర్తితో కొత్త త‌రం సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తుంది. ఆ ర‌క‌మైన అవాక‌శం క‌ల్పించిన హీరోల‌కు..నిర్మాతల‌కు ఇక్క‌డ క‌చ్చితంగా థాంక్స్ చెప్పాలి. వాళ్లే గ‌నుక ఆ క‌థ‌ల్ని న‌మ్మి ముందుకు రాక‌పోయుంటే ఇంకా వెనుక‌బ‌డే ఉండేవాళ్లం.

ఎలివేష‌న్స్ ప‌రంగా కేజీఎఫ్‌...విజువ‌ల్ గా బాహుబ‌లి లాంటి సినిమాలు ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతిని పంచాయి. ఆ ర‌కంగా భ‌విష్య‌త్ కి మంచి బాట వేసింద‌ని చెప్పొచ్చు. మ‌రి ఇప్పుడు తెర‌కెక్కిస్తోన్న మ‌రో క‌న్న‌డ సినిమాకి కేజీఎఫ్ ని స్పూర్తి అనొచ్చా? అంటే అన‌డంలో త‌ప్పేం లేద‌నిపిస్తుంది. ఉపేంద్ర క‌థానాయ‌కుడిగా ఆర్ చంద్రు ద‌ర్శ‌క‌త్వంలో తె ర‌కెక్కుతోన్న 'క‌బ్జా' టీజ‌ర్ కొద్ది సేప‌టి క్రిత‌మే రిలీజ్ అయింది.

ట్రైల‌ర్ ఆద్యంతం కేజీఎఫ్ ట్రైల‌ర్ నే త‌ల‌పించింది. ఎంపిక చేసుకున్న నేప‌థ్యం ...హీరో..విల‌న్ ఎలివేష‌న్స్... ఆర్ ఆర్ ఆర్ అన్ని కేజీఎఫ్ ని బేస్ చేసుకుని అల్లిన‌ట్లుగానే క‌నిపిస్తుంది. కేజీఎఫ్‌ త‌ర‌హాలోనే బ‌ల‌మైన ఎమోష‌న్ క‌నిపిస్తుంది. కేజీఎఫ్ కి వేసిన సెట్స్...వ‌ల‌స‌లు..బ్లాస్టింగ్స్ సీన్స్ ప్ర‌తీకి మ‌క్కీకి మ‌క్కీ దించేసిన‌ట్లు హైలైట్ అవుతుంది.

డాన్ త‌రహా ఉపేంద్ర ఎంట్రీ ప్ర‌తీది ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తున్నాయి. ఇంకా సినిమాలో కిచ్చా సుదీప్ లాంటి స్టార్స్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. అలాగే శ్రియా శ‌ర‌న్ హీరోయిన్ ముఖ్య భూమిక పోషిస్తుంది. రెండు విభిన్న పాత్ర‌ల్లో శ్రియ క‌న‌పించ‌నుంది. మ‌రి కేజీఎఫ్‌-క‌బ్జాకి మ‌ధ్య వ్య‌త్యాసం ఎక్క‌డుంది? అన్న‌ది రిలీజ్ త‌ర్వాత డిసైడ్ అవుతుంది.

ఈ సినిమాకి కేజీఎఫ్ కి ప‌నిచేసిన టెక్నిక‌ల్ టీమ్ ప‌నిచేయ‌డం విశేషం. ఆకార‌ణంగానూ కేజీఎఫ్ ఎఫెక్ట్ కొంత వ‌ర‌కూ క‌బ్జా ప‌డే అవ‌కాశం ఉంది. అది స్ప‌ష్టంగా క‌ళ్ల ముందు క‌నిపిస్తుంది. పాన్ ఇండియా లోఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ద‌క్షిణాదిన అన్నిభాష‌ల‌తో పాటు హిందీలోనూ భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.