Begin typing your search above and press return to search.

కైకాల హెల్త్‌ కండీషన్‌.. అవి కేవలం పుకార్లే

By:  Tupaki Desk   |   23 Nov 2021 10:47 AM GMT
కైకాల హెల్త్‌ కండీషన్‌.. అవి కేవలం పుకార్లే
X
లెజెండ్రీ యాక్టర్‌ కైకాల సత్యనారాయణ గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో బాధ పడుతున్న విషయం తెల్సిందే. ఆయన పరిస్థితి విషమించడంతో అపోలో ఆసుపత్రికి తీసుకు వెళ్లినట్లుగా కుటుంబ సభ్యులు తెలియజేశారు. అపోలో వైధ్యులు ఎప్పటికప్పుడు హెల్త్‌ బులిటెన్ ను విడుదల చేస్తూ కైకాల సత్యనారాయణ హెల్త్‌ గురించిన అప్‌ డేట్స్ ఇస్తూ వస్తున్నారు. ఆయన పరిస్థితి కాస్త సీరియస్ గానే ఉందంటూ అపోలో తమ ప్రెస్ నోట్‌ లో పేర్కొన్నారు.

శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేటర్ పై ఉంచినట్లుగా వైధ్యులు పేర్కొన్నారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న వార్తలు అభిమానులకు మరియు ఇండస్ట్రీ వర్గాల వారికి ఆందోళన కలిగిస్తున్నాయి.

సోషల్‌ మీడియాలో కొందు ఏకంగా కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతో ఉన్నారని.. ఆయన కోలుకోవడం సాధ్యం కాదంటూ ప్రచారం చేస్తుండగా మరి కొందరు దారుణంగా ఆయన మృతి చెందినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంకు కైకాల సత్యనారాయణ కూతురు రమా దేవి స్పందించారు. ఆమె మాట్లాడుతూ ఆయన ఆరోగ్యం కుదుట పడుతుందని.. సోషల్‌ మీడియాలో పుకార్లను పుట్టించవద్దంటూ విజ్ఞప్తి చేసింది.

ఆయన రెండు కిడ్నీలు సాదారణంగా పని చేస్తున్నాయి.. వెంటిలేటర్‌ పైనే ఉన్నా ఆయన శ్వాస సొంతంగా తీసుకుంటున్నారని వైధ్యులు చెప్పారు. వెంటిలేటర్‌ పై ఆధారపడటం తగ్గిందని వైధ్యులు అన్నారట. బీపీ కంట్రోల్‌ లో ఉండటంతో పాటు స్పృహలోకి వచ్చారని.. తన చుట్టు ఉన్న వారిని కూడా ఆయన చూశారంటూ గుడ్ న్యూస్ ను ఆమె తెలియజేసింది.

కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో బాధపడుతున్న వార్తలు ఆయన అభిమానులకు తీవ్రంగా వేదన కలిగించాయి. 700 సినిమాలకు పైగా నటించిన కైకాల వారు ఎన్నో అద్బుత పాత్రలను పోషించి తనకు మాత్రమే సాధ్యం అనిపించేలా యమధర్మరాజు పాత్రలో నటించి జీవించాడు. నిజంగా యమధర్మరాజు ఇలాగే ఉండేవాడేమో అన్నట్లుగా ఆయన నటించాడు.