Begin typing your search above and press return to search.
యముడికి మరణం ఏమిటి బాసూ?
By: Tupaki Desk | 23 Dec 2022 3:59 AM GMTపాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసినట్లుగా ఉండే సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఇక లేరన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పెద్ద వయస్కుడు కావటం.. దీర్ఘకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన్ను.. యముడు తన వెంట తీసుకెళ్లిపోయారు. వందలాది సినిమాల్లో నటించిన కైకాల పౌరాణిక పాత్ర విషయానికి వస్తే.. యుముడి పాత్రకు ఆయన సూట్ అయినట్లుగా మరెవరూ సూట్ కారనే చెప్పాలి.
యముండ అంటూ గంభీరస్వరంతో వచ్చే ఆయన మాట ఒక్కటి చాలు.. వెండి తెర మీద ఆయన్ను చూస్తున్న ప్రేక్షకుల మది పులకరించటానికి.. రోమాలు నిక్కబొడుచుకోవటానికి. ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్టుల్ని చూస్తే.. కైకాల గొప్పతనం తెలుస్తుంది. నాయకుడిగా.. ప్రతినాయకుడిగా.. హాస్య నటుడిగా.. అది జానపదమైనా.. పౌరాణికమైనా.. సాంఘికమైనా.. చారిత్రాత్మికమైనా.. కైకాల వారు టచ్ చేయని జానర్ అంటూ లేదు. అందులో ఆయన నటించటం కాకుండా జీవించేసి.. పాత్రతో కనెక్టు అయ్యే తీరు ఆయనకు మాత్రమే సొంతం.
ఇంతేనా.. ఐదు తరాల హీరోలతో సినిమాలు చేసిన ఆయన.. అరవై ఏళ్ల పాటు తెలుగు సినిమాతో కలిసి ప్రయాణం చేశారు. ఏకంగా ఎనిమిది వందల సినిమాలకు పైనే నటించిన ఆయన్ను.. తెలుగోడు ఎప్పటికి మరచిపోలేడు. హీరోలకు స్టార్లు.. సూపర్ స్టార్లు అన్న ట్యాగులు ఉంటాయి. అదే క్యారెక్టరర్ ఆర్టిస్టుకు అలాంటి ట్యాగులు తగిలిస్తే.. కైకాలను కొట్టేవాడు ఎవడూ ఉండడు.
ఆయన ఎన్ని పాత్రలు వేసినా.. యుముడిగా కనిపించినంతనే తెలుగు ప్రేక్షకుల నోటి నుంచి వచ్చేదొక్కటే. యుముడు అంటే కైకాల మాత్రమే. ఆయన మాత్రమే యుముడి పాత్రకు అచ్చు గుద్దినట్లుగా సరిపోతారు. గంభీరమైన స్వరం.. అంతకు మించిన కాఠిన్యం ఉట్టిపడే కళ్లు.. కొరకొరలాడే మీసాన్ని విలాసంగా వేలితో తిప్పుతూ.. రెండో చేత్తో గదను పట్టుకొని.. ఆయన నోటి నుంచి యముండ అన్న మాట వస్తే.. ఆ పులకరింత లెక్కే వేరు.
యముడి పాత్రను చాలామంది పోషించారు. కానీ.. వారెవరూ కైకాల సత్యనారాయణ దరిదాపుల్లోకి రారు. రాబోరు. మరి.. తన పాత్రను వెండితెర మీద వేసి.. కోట్లాది మందిని రంజింపచేసిన రీల్ యుముడ్ని.. రియల్ యుముడు తన చెంతకు తీసుకెళ్లిన వేళ..
యమలోకంలో వారి సంభాషణ ఎలా ఉంటుందో కదా? కైకాల మరణం కుంగదీసేదే అయినా.. అనారోగ్యంతో గడిచిన కొంతకాలంగా ఆయన పడుతున్న కష్టం చూసినప్పుడు మాత్రం శాశ్విత నిద్రలోకి జారిపోవటం.. ఆయనలోని జీవుడికి కాస్తంత సాంత్వన కలిగించేదనని మాత్రం చెప్పక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.