Begin typing your search above and press return to search.

‘బాహుబలి’ గాలి తీసేసిన కైకాల సత్యనారాయణ

By:  Tupaki Desk   |   22 March 2017 6:19 AM GMT
‘బాహుబలి’ గాలి తీసేసిన కైకాల సత్యనారాయణ
X
‘బాహుబలి’ పేరెత్తితే తెలుగు సినిమా ప్రేక్షకులు చాలా గర్వంగా ఫీలవుతారు. తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రంగా దీన్ని చెప్పుకుంటారు. ఈ చిత్రాన్ని విమర్శించిన వాళ్లూ లేకపోలేదు కానీ.. మెజారిటీ జనాలు దీన్ని ప్రైడ్ ఆఫ్ టాలీవుడ్ గా చెప్పుకుంటారు. ఐతే లెజెండరీ యాక్టర్ కైకాల సత్యనారాయణ మాత్రం ఈ చిత్రం గొప్పదనం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. భారీ సెట్టింగ్స్ వేసి.. గ్రాఫిక్స్ చేసేస్తే.. బాగా ఖర్చు పెట్టేస్తా గొప్ప సినిమా అయిపోతుందా అని ప్రశ్నించారాయన. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ‘బాహుబలి’ గురించి కైకాల ఏమన్నారంటే?

‘‘నేను బాహుబలి చూశాను. ఎందుకొచ్చింది దానికంత పేరు? అంత గొప్పేముంది అందులో? కథ ఏముంది అందులో చెప్పుకోవడానికి? వెరీ సింపుల్.. మూడు సెంటెన్సుల్లో చెప్పుకునే స్టోరీ అది. ఆ భారీ సెట్లు.. గ్రాఫిక్స్.. అంతే. ఇదివరకు మేం ట్రిక్స్ అనేవాళ్లం. దానికి అందమైన పేరు పెట్టి ‘గ్రాఫిక్స్’ అని.. కొన్ని కొన్ని కోట్లు పెడతారు దాని మీద. ఆ గ్రాఫిక్స్.. ఆ సెట్లు. ఆ కాస్ట్యూమ్స్.. అవీ తప్ప దాంట్లో ఉంది ఏంటండీ? మన మార్కెట్ కు అంత ఖర్చు పెట్టాల్సిన అవసరముందా చెప్పండి. ఐదొందల కోట్లు పెడితే ఐదొందల పిక్చర్లు తీయొచ్చు మనం. ఎన్ని సంవత్సరాలు.. మన జీవితాంతం దాకా తియ్యొచ్చు మనం. ఇలాంటివి మనం ఎన్నో ఇంగ్లిష్ పిక్చర్లు ఎప్పుడో చూశాం. అప్పుడున్న టెక్నాలజీతో అన్నీ ఇలాంటివే తీసేవాళ్లు. ఎప్పుడూ చూసేశాం ఆ సెట్లు.. ఆ గ్రాండియర్. ఇవ్వాళ ఆ గ్రాండియర్ మనకు ఎందుకు ఉపయోగపడుతుందంటారు? సొసైటీకి ఏం ఉపయోగం?’’ అని కైకాల ప్రశ్నించారు.

‘బాహుబలి’ తెలుగు సినిమా స్థాయిని పెంచిందన్న వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. ‘‘స్థాయిని పెంచిందని ఎట్లా అనుకుంటారు? గ్రాండ్ సెట్లు వేసి ఏదో ఖర్చు పెడితే పెంచినట్లా చెప్పండి నాకు తెలియకడుగుతాను. అంత ఖర్చు పెట్టి అంత గ్రాండ్ గా అంత పెద్ద సెట్లు వేసి గ్రాఫిక్స్ చేస్తే మన తెలుగు సినిమా స్థాయిని ఎలివేట్ చేసినట్లా? మొన్న ఒక చిన్న పిక్చర్ వచ్చింది. బ్రహ్మాండంగా పోయింది. మరి దానికి ఎందుకంత పేరొచ్చి అంత బాగా పోయింది. ఏదో అడుక్కునేవాడో ఏదో వచ్చిందది. బిచ్చగాడు.. మరి టెర్రిఫిక్ గా పోయింది. ప్రొడ్యుసర్ కి బోలెడంత లాభం వచ్చింది. చెప్పండి మరి ఏంటి ఇది పిక్చర్ కాదా? ఇది బాగా చెయ్యలేదా? శారద ఉంది. శారద పిక్చర్ కాదా? ‘శాతవాహన’ ఉంది. అందులో నీతి ఉంది. అది పిక్చర్ కాదా? అది బాగా పోలేదా? మరి దానికి ఏం ఖర్చయింది? అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఇంత భారీగా తీసి.. ఇంతంత అబ్బో కళ్లు జిగేల్ అనిపించేలా సెట్లు వేశారు కాబట్టి గొప్ప పిక్చరనా? ఇండస్ట్రీకి పేరు ప్రఖ్యాతులొచ్చాయనా?’’ అని అన్నారు కైకాల.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/