Begin typing your search above and press return to search.

ప్రభాస్ ఎవరికి అభిమానో తెలుసా!!

By:  Tupaki Desk   |   7 April 2017 5:30 AM GMT
ప్రభాస్ ఎవరికి అభిమానో తెలుసా!!
X
ప్రభాస్.. ఇప్పుడు బాహుబలిగా ప్రపంచం మొత్తానికి తెలుసు. కృష్ణం రాజు వారసుడిగా అరంగేట్రం చేసి.. యంగ్ రెబల్ స్టార్ గా ఎదిగి.. ఇప్పడు తనకంటూ ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. కోట్లాది మంది అభిమానులు ప్రభాస్ కోసం.. ప్రభాస్ సినిమా కోసం వెర్రిగా ఎదురు చూసే స్థాయికి చేరుకున్నాడు.

మరి ఇంతటి స్టార్ హీరో కూడా ఓ ఆర్టిస్ట్ కి వీరాభిమానే అంటే ఆశ్చర్యం వేయక మానదు. అతను ఎవరో కాదు. సింగర్ కైలాష్ ఖేర్. బాలీవుడ్ లోనే కాదు.. టాలీవుడ్ లోనూ పలు అద్భుతమైన పాటలు పాడాడీయన. అరుంధతి మూవీలోని 'జేజమ్మా' పాటను పాడింది కైలాషే. అంతే కాదు.. బాహుబలికి ముందు ప్రభాస్ బ్లాక్ బస్టర్ మిర్చి మూవీలోని 'పండగలా దిగి వచ్చాడు' పాటకు కూడా కైలాష్ ఖేర్ గాత్రం అందించాడు. ఇప్పుడు బాహుబలి2లో కూడా ఓ పాట పాడాడు ఈ సింగర్.

'దండాలయ్యా' అంటూ తెలుగులో సాగే పాటకు హిందీ వెర్షన్ 'జయ జయకర' అంటూ సాగుతుంది. దీనికి కైలాష్ ఖేర్ స్వరం ఇవ్వడంతో.. ఇప్పటికే ఛార్ట్ బస్టర్ గా నిలిచింది. మరోవైపు ఏప్రిల్ 28న తన నాలుగుగేళ్ల కష్టం బాహుబలి2 రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు ప్రభాస్. బాహుబలి2 మూవీకి సుజిత్ తో ప్రభాస్ చేయనున్న మరుసటి చిత్రం టీజర్ ను కూడా జత చేయనుండడంతో.. ప్రభాస్ ఫ్యాన్స్ ని డబుల్ ట్రీట్ అనాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/