Begin typing your search above and press return to search.
కళాతపస్వి కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
By: Tupaki Desk | 25 April 2017 4:08 AM GMTఎంతోమందికి ఇష్టమైన దర్శకుడు.. సామాజిక స్పృహ ఉన్న చిత్రాలను రూపొందించడంలో సిద్ద హస్తుడు.. కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు ఇప్పుడు అరుదైన గౌరవం దక్కింది. విభిన్న కథలను తనదైన శైలిలో రూపొందించే ఈ దర్శకుడికి భారత ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు. 2016 సంవత్సరానికి గానూ విశ్వనాథ్‌కు ఈ పురస్కారాన్ని అందుకుంటారు.
సినిమాల ద్వారా దేశానికి.. ఇక్కడ ప్రజలకు.. అత్యున్నత సేవను చేసిన వారికే ఈ అవార్డును అందిస్తారు. 1957లో సౌండ్ రికార్డిస్ట్ గా కెరియర్ ప్రారంభించిన విశ్వనాథ్.. 1965లో ‘ఆత్మగౌరవం’ సినిమా ద్వారా దర్శకుడయ్యారు. ఆ తరువాత ఈ 87 ఏళ్ళ దర్శకుడు తన కెరియర్లో ఎన్నో మైలురాళ్లను టచ్ చేశారనే చెప్పాలి. 'సిరి సిరిమువ్వ’ చిత్రంతో రాగా.. ‘శంకరాభరణం’ సినిమాతో రేంజే మారిపోయింది. ఆ సినిమా ఏకంగా జాతీయ అవార్డును అందేసుకుంది. ఆ తరువాత ‘సాగర సంగమం’ - ‘శృతిలయలు’ - ‘సిరివెన్నెల’ - ‘స్వర్ణకమలం’, ‘స్వాతికిరణం’ వంటి ఆణిముత్యాలను రూపొందించారు. ఆణిముత్యమే. 1986లో ‘స్వాతిముత్యం’ సినిమా ఆస్కార్ అవార్డుకు అధికారిక ప్రవేశం పొందడం విశేషం. ఆయన తీసిన ఐదు సినిమాలు జాతీయ అవార్డులు అందుకున్నాయి.
భారతీయ సినిమాకు కాశినాథుని విశ్వనాథ్ చేసిన కృషికిగాను ప్రభుత్వం ఆయన్ను 1992లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించగా.. ఇప్పుడు 2016లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఇస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన విశ్వనాథ్.. ''ఈ పురస్కారం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నా తల్లిదండ్రుల దీవెనలు ఫలించాయి.. నన్ను ఆదరించిన అందరికీ కృతజ్ఞతలు'' అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/