Begin typing your search above and press return to search.
సంతృప్తి లేదన్న కె. విశ్వనాథ్
By: Tupaki Desk | 25 April 2017 5:21 AM GMTదాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ గెలుచుకోవడం అంటే.. ఏ ఆర్టిస్ట్- టెక్నీషియన్ కి అయినా జీవిత సాఫల్య పురస్కారం దక్కినట్లే. కళాతపస్వి అని టాలీవుడ్ ముద్దుగా పిలుచుకునే కె. విశ్వనాథ్ కు ఇప్పుడా పురస్కారం దక్కింది. ఇంతటి ఖ్యాతి గడించినా.. ఇంకా తనకు దర్శకుడిగా సంతృప్తి లేదంటున్నారు కళా తపస్వి.
'దర్శకుడిగా సంతృప్తికరమైన ప్రయాణం సాగిందని నేను అనుకోవడం లేదు. నాకే కాదు.. ఏ కళాకారుడికీ సంతృప్తి ఉండదు. శంకరాభరణం తీశా కదా అని ఇక చాలు అనుకోలేం కదా. కళ.. సంగీతం.. సాహిత్యం.. వీటన్నిటి గురించి ఎంత చెబితే మాత్రం సరిపోతుంది. అయితే.. సినిమా కళతో మంచి చెప్పాలని కొందరు అంటారు. అది వ్యాపారం అంటారు మరికొందరు.. వినోదం అంటారు మరికొందరు. ఎవరి ఆలోచన వారిది. నేను కళా సేవ చేసేశానని అనుకోను. ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం చేయడం కాదు కదా. అయితే.. విలువలకు దూరంగా ఒక సినిమా కూడా తీయలేదు' అన్నారు కళా తపస్వి.
'ఇప్పటి తరానికి సలహాలు నేనేమీ ఇవ్వను. వారేమన్నా అమాయకులా? అందరూ ప్రతిభ కలవారే. అందుకే వారిపై కోట్లు కుమ్మరించి సినిమాలు తీస్తున్నారు నిర్మాతలు. ఇప్పటి దర్శకులపై ఎంతో ఒత్తిడి ఉంటోంది. ద్రౌపదికి ఐదుగురు భర్తలయితే.. ఈ కాలం డైరెక్టర్లకు 50 మంది ఉంటున్నారు. అందరి సంతృప్తి పరస్తూ సినిమా తీయడం చిన్న విషయం కాదు' అన్నారు కె. విశ్వనాథ్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/