Begin typing your search above and press return to search.
మరో ఖైదీ వస్తున్నాడు
By: Tupaki Desk | 9 March 2019 8:37 AM GMTటాలీవుడ్ కు సంబంధించినంత వరకు ఖైదీ అనే పదానికి బ్రాండ్ అంబాసడర్ ఒక్క చిరంజీవి మాత్రమే. ఆయన కెరీర్ నే కాదు తెలుగు సినిమా గమనాన్ని మార్చిన సినిమాగా అందరూ ఒప్పుకునే సత్యమిది. సెంటిమెంట్ గా కూడా ఈ పేరు చిరుకి బాగా కలిసి వచ్చింది. విజయబాపినీడు తీసిన ఖైదీ నెంబర్ 786 బ్లాక్ బస్టర్ కాగా కం బ్యాక్ మూవీ కోసం పెట్టుకున్న టైటిల్ ఖైదీ నెంబర్ 150 మరోసారి ఈ నమ్మకాన్ని బలోపేతం చేసింది.
ఖైదీ వచ్చాక ఇంకొందరు హీరోలు ఏదో ఒక తోక తగిలించి ఖైదీని వాడుకున్నా ఆ స్థాయి విజయం మాత్రం సొంతం కాలేదు. ఇక ఈ తరం హీరోలు ఎవరూ ఖైదీ జోలికి వెళ్లనే లేదు. ఒకపక్క గ్యాంగ్ లీడర్ టైటిల్ రచ్చ కొనసాగుతూ ఉండగానే మరో యూత్ హీరో కార్తీ ఖైదీ పేరుతో వస్తున్నాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీకి ఖైతి అంటే టైటిల్ ఫిక్స్ చేసారు. తెలుగులో ఖైదీ అని అర్థం.
ఫస్ట్ లుక్ లోనే ఊచల రూపంలో రక్తం ధారలుగా కారుతుంటే దాని వెనుక కార్తీ దెబ్బ తిన్న సింహంలా చూస్తున్న చూపు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలుగులో ఇదే పేరు పెడతారా లేక మారుస్తారా ఇంకా తెలియాల్సి ఉంది. సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్న ఈ ఖైతి మీద కార్తీకి చాలా నమ్మకం ఉంది. దేవ్ ఘోరంగా దెబ్బ తిన్న తరుణంలో సాలిడ్ కం బ్యాక్ ఒకటి అవసరం. పైగా నా పేరు శివ తర్వాత వచ్చిన మార్కెట్ ని తెలుగులో కార్తీ నిలబెట్టుకోలేకపోయాడు. ఇప్పుడీ మెగాస్టార్ టైటిలైనా ఉపయోగపడుతుందేమో చూడాలి