Begin typing your search above and press return to search.
టీజర్ టాక్: అంతు చిక్కని ఖైది
By: Tupaki Desk | 31 May 2019 4:17 AM GMTగత కొంత కాలంగా తన స్థాయి సక్సెస్ లేక రేస్ లో వెనుకబడ్డ కార్తీ ఇటీవలే వచ్చిన దేవ్ మరీ దారుణంగా డిజాస్టర్ కావడంతో కొంత ఇబ్బందిలో పడ్డాడు. అతని కొత్త సినిమా ఖైదీ టీజర్ తాజాగా విడుదలైంది. కథ విషయానికి వస్తే కాస్త డిఫరెంట్ గానే ట్రై చేసినట్టు ఉన్నారు. డిల్లి(కార్తీ)కరుడు గట్టిన హంతకుడు. ఓసారి పోలీసులు జైలుకు తీసుకెళ్తు ఉండగా చేతికి సంకెళ్ళతోనే తప్పించుకుని ఓ లారీతో సహా పారిపోతాడు.
మరోవైపు నరరూప రాక్షసుల్లాంటి రౌడీ బ్యాచ్ ఒకటి డిల్లి కోసం వెతుకుతూ ఉంటుంది. అతన్ని చంపితే జీవితాంతం సరిపడా డబ్బులిస్తామని ఆఫర్ ఇస్తుంది. దీంతో డిపార్ట్ మెంట్ ఒక వైపు ఈ గూండాల బ్యాచ్ ఒకవైపు డిల్లి కోసం వేట సాగిస్తారు. కానీ భీముడి బలం అర్జునుడి తెలివి ఉన్న డిల్లి వీళ్ళకు అంత సులువుగా దొరకడు. చివరికి ఏమైంది అనేదే ఖైదీ కథ
ఇది మొత్తం ఒకే ఒక్క రాత్రిలో జరిగే కథ. కార్తీ చాలా డిఫరెంట్ లుక్స్ తో ఫెరోషియస్ క్రిమినల్ అంటే ఇలాగే ఉంటాడనే లుక్స్ తో ఆకట్టుకున్నాడు. మొత్తం చీకటి వాతావరణం కాబట్టి కెమెరా మెన్ సత్యన్ సూరన్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల మేకింగ్ లో చాలా క్వాలిటీ కనిపిస్తోంది. సామ్ సీఎస్ సంగీతం కూడా ఎలివేట్ చేసింది. ఒకరకమైన రానెస్ తో దర్శకుడు లోకేష్ కనగరాజ్ చూపించిన టేకింగ్ బాగుంది.
కొన్ని హాలీవుడ్ సినిమాల ఛాయలు కనిపించినప్పటికీ వైవిధ్యాన్ని చక్కగా ప్రెజెంట్ చేశాడు. హీరోయిన్ లేకుండా కేవలం హీరో-పోలీసులు-రౌడీలు ఈ ట్రయాంగిల్ నేపథ్యంలో తీసుకున్న బ్యాక్ డ్రాప్ మొత్తానికి ఆసక్తి రేపడంలో విజయవంతం అయ్యింది. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానున్న ఖైదీ టైటిల్ పరంగా మెగా ఫాన్స్ అటెన్షన్ తీసుకుంటోంది.