Begin typing your search above and press return to search.

కాజ‌ల్ ఈసారైనా ఆ స్టార్ హీరోకి హిట్ ఇచ్చేనా...?

By:  Tupaki Desk   |   2 Sep 2020 11:30 PM GMT
కాజ‌ల్ ఈసారైనా ఆ స్టార్ హీరోకి హిట్ ఇచ్చేనా...?
X
సౌత్ ఇండస్ట్రీలో ప్రతిభావంతులైన నటుల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నారు హీరో సూర్య. వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ అటు తమిళ ప్రేక్షకులే కాకుండా ఇటు తెలుగు ప్రేక్షకులు కూడా అభిమానించే స్థాయికి చేరుకున్నాడు. ఈ క్రమంలో లేటెస్టుగా 'ఆకాశం నీ హద్దురా' సినిమాతో వస్తున్నాడు. 'గురు' ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. దీంతో పాటు వెట్రిమారన్‌ దర్శకత్వంలో సూర్య 'వాడివసల్‌' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా తీసుకున్నారని కోలీవుడ్ వర్గాల్లో అనుకుంటున్నారు.

కాగా, సూర్య - కాజల్ అగర్వాల్ కాంబినేషన్ లో 'బ్రదర్స్' అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. సూర్య ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే ఇప్పుడు ఆ సెంటిమెంట్స్ ఏమీ పట్టించుకోకుండా మరోసారి సూర్య కాజల్ తో జతకట్టడానికి రెడీ అయ్యాడని తెలుస్తోంది. మరి ఈసారైనా ఈ కాంబోలో సరైన హిట్ పడుతుందేమో చూడాలి. ఇక సూర్య ఈ సినిమాతో పాటు హరి దర్శకత్వంలో 'అరువా' అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ మూవీలో రాశీ ఖ‌న్నా బికినీ వేయడానికి రెడీ అయిందని తెలుస్తోంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి గ్లామరస్ రోల్స్ చేస్తూ వచ్చిన ఈ బ్యూటీ.. సూర్య సినిమా కోసం గ్లామర్ షో చేయడానికి సిద్ధపడినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.