Begin typing your search above and press return to search.

చందమామ కూడా అప్పట్లో అలా చేసిందట

By:  Tupaki Desk   |   20 March 2017 4:00 AM GMT
చందమామ కూడా అప్పట్లో అలా చేసిందట
X
హీరోయిన్ అన్నాక రాజీ పడక తప్పదు. అగ్ర హీరోయిన్లు అయినప్పటికీ.. కొన్నిసార్లు నచ్చినా.. నచ్చకున్నా అభ్యతరకర సన్నివేశాల్లో నటించక తప్పనిసరి పరిస్థితి ఉంటుంది. అలాంటి అనుభవం బ్యూటీ చందమామకు కూడా తప్పలేదట. ఏళ్లకు ఏళ్లుగా గ్లామర్ ఫీల్డ్ లో నిలదొక్కుకోవటం.. స్టార్ డమ్ ను కంటిన్యూ చేయటం అంత చిన్న విషయం కాదు. కానీ.. కాజల్ అగర్వాల్ మాత్రం అందుకు భిన్నంగా స్టార్ హీరోయిన్ల జాబితాలోనే కొనసాగుతున్నారు.

హీరోయిన్లకు ఏదో ఒకసారి కాంప్రమైజ్ కావటం తప్పదా? అన్న ప్రశ్నకు అవుననే బదులిస్తోందీ ముద్దుగుమ్మ. ప్రతిభ ఉన్నప్పటికీ అవకాశాల కోసం కొన్నిసార్లు రాజీ పడక తప్పదన్న మాట ఇండస్ట్రీలో తరచూ వినిపిస్తూ ఉంటుంది. మరీ.. విషయంలో మీ అనుభవం ఏమిటన్న ప్రశ్నను కాజల్ ను అడిగితే.. ఆసక్తికర సమాధాన్ని చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.

అభ్యంతరకరంగా చూపించటం మామూలే. మిగిలిన సన్నివేశాలతో పోలిస్తే.. పాటల్లో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఇలాంటివి తనకు అస్సలు తెలీవని.. కానీ..కొన్ని అభ్యంతరకరంగా ఉండే సీన్లు తాను చేశానని.. ఆ విషయం తర్వాత అర్థమై.. ఆ బాట పట్టకూడదని ఫిక్స్ అయినట్లుగా వెల్లడించింది. అలాంటి అనుభవం ఎదురైన తర్వాత నుంచి పాత్రల్ని ఎంపిక చేసుకునే విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నానని.. లక్కీగా తర్వాత ఎప్పుడూ అలాంటి పరిస్థితి ఎదురు కాలేదని చెప్పుకొచ్చింది. గతం గురించి ఇంత ఓపెన్ గా స్టార్ హీరోయిన్ చెప్పటం విశేషమే మరి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/