Begin typing your search above and press return to search.
మొత్తానికి కాజల్ ఒప్పేసుకుందా?
By: Tupaki Desk | 8 Nov 2017 9:25 AM GMTమొన్నామధ్యన హీరో శర్వానంద్ కొత్త సినిమాలో కాజల్ ను హీరోయిన్ గా తీసుకుంటున్నారనే రూమర్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే శర్వా వంటి సెకండ్ లైన్ స్టార్లతో నటిస్తే తన రేంజు పడిపోతుందని ఫీలైన చందమామ.. ఈ సినిమాను చేయట్లేదనే టాక్ కూడా వినిపించింది. కాని ఇప్పుడు మాత్రం సన్నిహితులు చెబుతున్న అసలు విషయం వేరేలా ఉంది.
స్వామిరారా.. దోచెయ్.. కేశవ వంటి సినిమాలను తెరెక్కించిన సుధీర్ వర్మ.. ఇప్పుడు తన కొత్త సినిమాను శర్వానంద్ తో తీస్తున్నాడు. ఈ సినిమాలో ఇప్పటివరకు శర్వా అసలు పెద్ద స్టార్ హీరోయిన్లతో నటించలేదు కాబట్టి.. అతగాడి పక్కనే ఎవరన్నా పెద్ద స్టార్ ను తీసుకుందాం అనుకున్నారట. అందులో భాగంగా కాజల్ తో సంప్రదింపులు జరిపితే.. తొలుత ఆమె క్లారిటీ ఇవ్వలేదు కాని.. ఇప్పుడు మాత్రం దాదాపు 2 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుని ఓకె చేసిందని తెలుస్తోంది.
అయితే 2 కోట్లు ఇచ్చేటప్పుడు కాజల్ ఎందుకు.. లేటెస్ట్ సెన్సేషన్ అయిన ఏ రకుల్ ప్రీత్.. పూజా హెగ్డే వంటి భామలను తీసుకోకూడదా? ఏదేమైనా కూడా అటుతిరిగి ఇటు తిరిగి కాజల్ కు ఆఫర్లు మరియు హిట్లు బాగానే వస్తున్నాయి. ఇకపోతే సీనియర్ హీరో వెంకటేష్ సినిమాలో నటించడానికి కాజల్ అంగీకరించలేదని ఒక టాక్ వినిపిస్తోంది. చరణ్ అండ్ చిరంజీవితో చేసిన ఈ సుందరి.. రానాతో చేశాక వెంకీతో చేయడానికి ఏం మొహమాటం వచ్చిందో మరి!!