Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: బ్లాక్‌ అండ్‌ వైట్‌ చందమామ

By:  Tupaki Desk   |   8 Jun 2015 1:51 PM GMT
ఫోటో స్టోరి: బ్లాక్‌ అండ్‌ వైట్‌ చందమామ
X
ఇంతకాలం కాజల్‌ని పొగడాల్సి వస్తే చందమామ అని నాలుగు అక్షరాలతోనే సరిపుచ్చుకునేవాళ్లం. అంతకంటే గొప్పగా పొగడాలి అనిపిస్తే రాకుమారి మిత్రవింద అనో లేక కాలభైరవుని ప్రేయసి అనో, అంతకుమించి బిజినెస్‌మేన్‌ ప్రియురాలు చిత్ర అనో పిలిచేేసేవాళ్లం. అంతకుమించిన సందర్భాలేవీ ఈ అమ్మడి కెరీర్‌లో కనిపించనేలేదు.

కానీ ఇదిగో ఇలా కనిపించాక కవులకు పదజాలం అందడం లేదు. వర్ణించనలవి కానంత అందంగా ఉంది ఈ డ్రెస్‌లో. తెల్లని క్రీమ్‌ రంగు టాప్‌కి, నల్లని బాటమ్‌ డిజైన్‌తో అదిరిపోయే డ్రస్సులో కనిపించి మతుల్‌ సుతుల్‌ తప్పేలా చేస్తోంది. అల్ట్రామోడ్రన్‌ లుక్‌లో, కార్పొరెట్‌కి పాఠాలు నేర్పించే అభినవ కన్యకలా కనిపిస్తోంది. సింపుల్‌ స్మయిల్‌, ఫ్రీ హెయిర్‌ స్టయిల్‌ ఆ కాంబినేషనే సూపర్భ్‌. మన్మధునికి మతి తప్పాలంటే ఇలలోనో కలలోనో చందమామ కనిపించనక్కర్లేదు. భూమ్మీదనే ఉంది ఆరడుగుల నిలువెత్తు చందమామ. గుండెల్లో మన్మధబాణాలు గుచ్చేసే బుట్టబొమ్మ. అవిగో అక్కడ కనిపించే అద్దాలు సైతం ఆ అందాన్ని తనలో ఇమిడ్చేసుకోవడానికి ఆత్రపడుతున్నాయంటే అతిశయోక్తి కానేకాదు.

ఓ అవార్డు ఫంక్షన్‌లో బ్యాక్‌లెస్‌ ఫోజులో చూస్తుంటే మతి చెడాల్సిందే మరి. నిన్ననే అమ్మడు ఇలా దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఈ భామ తమిళంలో మూడు సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో మాత్రం ఖాళీ!!