Begin typing your search above and press return to search.

చందమామ అందాలు అగ్గి రాజేసాయ్

By:  Tupaki Desk   |   18 Dec 2017 5:08 AM GMT
చందమామ అందాలు అగ్గి రాజేసాయ్
X
టాలీవుడ్ చందమామగా పిలిపించుకునే వయ్యారి కాజల్ అగర్వాల్. ఈ భామకు అందాల ప్రదర్శన కొత్తేమీ కాదు. గ్లామర్ హీరోయిన్ గా అగ్రస్థానంలో వెలిగిన ఈ సుందరాంగి.. ఇప్పటికీ తన స్థాయిని కొనసాగిస్తూనే ఉంది. మధ్యలో కొంతకాలం కాజల్ కెరీర్ పై డౌట్స్ ఏర్పడ్డా.. ఈ ఏడాది ఖైదీ నంబర్ 150.. నేనే రాజు నేనే మంత్రి చిత్రాల సక్సెస్ తో తిరిగి గాడిలో పడిపోయింది.

ఇక ఈవెంట్లలోనూ కాజల్ అగర్వాల్ అందాల డోస్ ఎక్కువగానే ఉంటుంది. అప్పుడప్పుడూ అయితే.. ఎప్పడూ సినిమా స్క్రీన్ పై ఒలికించనన్ని సొగసులను కుమ్మరిస్తూ ఉంటుంది. బాలీవుడ్ ట్రయల్స్ లో భాగంగా అప్పట్లో ఇలాంటివి కంటిన్యూగా కనిపించేవి. కానీ కొంతకాలంగా క్లీవేజ్ అందాల ప్రదర్శనకు దూరమైన ఈ చందమామ.. నిన్న జరిగిన జీ గోల్డెన్ అవార్డ్స్ ఈవెంట్ లో మాత్రం మళ్లీ అదే రూట్ కి వచ్చేసింది. డిజైనర్ బ్లాక్ డ్రెస్ ధరించిన చందమామ.. డీప్ కట్ నెక్ తో మెరుపులు మెరిపించేసింది.

చందమామ ఈస్థాయిలో అందాలను పంచడం చాలా అరుదు. అందునా ఇలాంటి మేజర్ ఫంక్షన్ లో అయితే.. మరింత అలర్ట్ గా ఉంటుంది. అది సరే కానీ.. ఇంతకీ కాజల్ ఇప్పుడు ఇంతగా అందాలను పంచేసి అగ్గి రాజేయడానికి కారణం ఏంటో మాత్రం ఎవరికీ అర్ధం కావడం లేదు. మళ్లీ ఏమన్నా ఉత్తరాది వైపు చూపులు చూస్తోందా అనే అనుమానాలు పలువురిలో మొదలయ్యాయి.