Begin typing your search above and press return to search.
ఆకాశంలో చందమామని దగ్గరగా చూసినట్లే!
By: Tupaki Desk | 31 July 2021 9:30 AM GMTరెండు దశాబ్ధాల కెరీర్ కి చేరువవుతున్నా చందమామ కాజల్ లో లావణ్యం పెరుగుతోందే కానీ తరగడం లేదు. కుర్ర కారులో కాజల్ అగర్వాల్ క్రేజ్ అంతా ఇంతా కాదు. టాలీవుడ్ లో ఇప్పటికీ తన ఫాలోయింగ్ తరగలేదు. అయితే కాజల్ తనదైన అందం ప్రతిభతో కెరీర్ ఆరంభంలోనే తనకంటూ ఓ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది. అటుపై వచ్చిన సక్సెస్ లు...సోషల్ మీడియా ఫాలోయింగ్ ఆమె క్రేజ్ ని మరింత పెంచాయి.
ట్రెడిషనల్ గా కనిపిస్తూనే.. హాట్ కంటెంట్ ఎలివేషన్ యాంగిల్ కూడా తన ఎదుగుదలలో కీలక పాత్ర పోషించింది. అల్ట్రా మోడ్రన్ లుక్ లో అందాల ఎలివేషన్స్ లోనూ తాను తక్కువేం కాదని చాలాసార్లు ప్రూవైంది. పూల్ సైడ్ బికినీ.. టూపీస్ ల్లో చాలాసార్లు రచ్చ చేసింది. ఇటీవల పెళ్లి తర్వాతా నిరంతరం కొత్త ఫోటోషూట్లతో వేడెక్కించడం కాజల్ ప్రత్యేకత.
తాజాగా చందమామ మరోసారి కూల్ అండ్ చిల్ లుక్ లో ఆకట్టుకుంది. పింక్...బ్లూ...డార్క్ బ్లూ కలర్ డిజైనర్ దుస్తుల్లో కాజల్ మెరిసిపోతోంది. డిఫరెంట్ కోణాల్లో కాజల్ ఫోజులిస్తూ చూపరులను ఆకట్టుకుంటోంది. అందులో క్లోజ్ అప్ లో ఉన్న ఓ డార్క్ స్టిల్ లో కిల్లింక్ లుక్ ఆకర్షణీయంగా ఉంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో జోరుగా వైలర్ అవుతున్నాయి. చందమామ అభిమానులు ఆసక్తికర కామెంట్లు పెడుతూ అభిమానం చాటుకుంటున్నారు.
ఇక కాజల్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం మెగాస్టార్ సరసన `ఆచార్య`లో నటిస్తోంది. బాస్ తో కలిసి నటించడం ఇది రెండవ సారి. తొలిసారి `ఖైదీ నంబర్ 150` లో నటించి పెద్ద సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత చందమామ కెరీర్ మళ్లీ టాలీవుడ్ లో స్పీడ్ అందుకుంది. ప్రస్తుతం కాజల్ చేతిలో దాదాపు అరడజను సినిమాలు చేస్తోంది. అందులో కొన్ని కరోనా రాకతో రిలీజ్ వాయిదా పడ్డాయి. మరికొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి. ఇంకొన్ని ప్రీ ప్రోడక్షన్ దశలోనూ ఉన్నాయి.
హిందీలో బిజీ అవుతోంది:
ఇటీవల భారతీయుడు 2 వివాదం వల్ల నిలిచిపోవడంతో కాజల్ చూపు హిందీ వైపు ప్రసరంచింది. ఇటీవల కోల్ కతాలోని `ఉమా` మూవీ సెట్స్ లో కుల్హాద్ చాయ్ ని ఆస్వాధిస్తూ కాజల్ కనిపించింది. `స్లైస్ ఆఫ్ లైఫ్` పేరుతో రూపొందుతున్న ఈ మూవీకి తథాగత సింఘ దర్శకత్వం వహిస్తున్నారు. ఉమా అనే మహిళ చుట్టూ తిరిగే కథాంశంతో ఈ మూవీ రూపొందుతోంది. కోల్ కతాలో షూటింగ్ స్టార్ట్ అయ్యింది. కాజల్ అగర్వాల్ ఆన్ లొకేషన్ నుంచి ఇన్ స్టా లో స్వయంగా ఈ ఫోటోని షేర్ చేశారు. కుల్ హాడ్ లో అలా టీ సిప్ చేస్తున్న కొన్ని ఫోటోలను పంచుకోగా వైరల్ అయ్యాయి. మిరాజ్ గ్రూప్ నుండి అవిషేక్ ఘోష్ - మంతరాజ్ పాలివాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
కాజల్ అగర్వాల్ ఈ క్రేజీ హిందీ చిత్రం కోసం రూ .2 కోట్ల పారితోషికం అందుకుంటోంది. తన కెరీర్లో అత్యధిక వేతన చెక్ ఇది. ఈ మూవీతో పాటు ప్రస్తుతం హే సినమికా చిత్రీకరణ సాగుతోంది. లైకా ప్రొడక్షన్స్ తో దర్శకుడు శంకర్ వివాదం కారణంగా భారతీయుడు 2 షూటింగ్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. శంకర్ తదుపరి ఆర్.సి 15 చిత్రీకరణకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నాయిక తో పాటు.. కాజల్ కి చెర్రీ కానీ శంకర్ కానీ ఏదైనా రోల్ లో ఆఫరిస్తారేమో చూడాలి.