Begin typing your search above and press return to search.

కాజల్ కాళ్లకు ఏమైంది బాసూ?

By:  Tupaki Desk   |   13 May 2016 5:30 PM GMT
కాజల్ కాళ్లకు ఏమైంది బాసూ?
X
ఈరోజు ఉదయం హైదరాబాద్‌ లో హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ ఒక చెప్పుల షాపులో స్పెషల్‌ కలక్షన్‌ ఒకటి లాంచ్‌ చేయడానికి హీరోయిన్‌ సమంతతో కలసి వచ్చింది. ఈ సమయంలో అమ్మడు చెయిర్‌ లో కూర్చున్నప్పుడు.. తన తెల్లటి పిక్కలను కెమెరా కళ్ళకు దారబోసింది. బాగానే ఉంది. అయితే కాసేపు అలాగే వీక్షించిన ప్రబుద్దులకు ఏదో తేడా కొట్టేసినట్లయ్యింది.

గతంలో కూడా ఇలా చిట్టిపొట్టి డ్రస్సుల్లో చాలాసార్లు ప్రైవేట్‌ ఈవెంట్లకు వచ్చింది కాజల్‌. ఇక డౌట్‌ ఏంటంటే.. ఆమో మోకాలి చిప్పలను చూస్తుంటే.. చాలా సన్నబడిపోయినట్లు.. ఆమె కాలికి ఏదో అయినట్లు కనిపించింది. ఒక ప్రక్కన జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ వంటి భామలు ఏకంగా తమ కాళ్ల కర్వ్ తో పడేస్తుంటే.. కాజల్‌ ఏంటి తన కాళ్ళను ఇలా తయారుచేసుకుంది అనే సందేహం రావొచ్చు. కారణం ఏంటంటే.. అప్పట్లో కాజల్‌ బొద్దుగా ఉందని అందరూ కామెంట్‌ చేయడంతో.. అమ్మడు బీభత్సమైన డైటింగ్‌ చేసి వెయిట్‌ తగ్గిపోయింది. దానితో కాళ్ళు కూడా అలా బక్కపడిపోయాయ్‌. అందుకే మనకు అలా తేడాగా కనిపిస్తున్నాయి.

సడన్‌ గా స్లిమ్‌ అయితే ఇలాగే బాడీ లాంగ్వేజ్‌ మారిపోయే ఛాన్సుంది. బ్రహ్మోత్సవం సినిమాలో ఆఫర్‌ రాగానే.. ఎగిరి గంతేసి మరీ షార్టు టైమ్‌లో స్లిమ్‌ అయిపోయింది ఈ చందమామ. అందుకే ఈ తేడాలన్నీ.