Begin typing your search above and press return to search.
కాజల్ ముందు పెద్ద ఛాలెంజ్ ఉంచిన ప్రవీణ్ సత్తార్
By: Tupaki Desk | 4 July 2021 11:30 AM GMTనాగార్జున గత చిత్రం వైల్డ్ డాగ్ కు కమర్షియల్ గా నిరాశ మిగిలిన విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రేక్షకులు కూడా చూసిన వారు అభినందించారు. నాగార్జున ఈ వయసులో కూడా ఇలాంటి పాత్రలను చేసేందుకు కమిట్ అవ్వడం నిజంగా అభినందనీయం అంటూ పలువురు కామెంట్స్ చేశారు. వైల్డ్ డాగ్ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా నాగార్జున మరో యాక్షన్ స్పై థ్రిల్లర్ ను చేసేందుకు సిద్దం అయ్యాడు. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నాగార్జున ఎక్స్ రా ఏజెంట్ గా కనిపిస్తాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ సినిమాలో కాజల్ కీలక పాత్రలో కనిపించబోతుంది.
ఈ సినిమాలో కాజల్ పాత్ర హీరో నాగార్జున పాత్రకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. గత కొన్ని రోజులుగా కాజల్ ను దర్శకుడు ప్రవీణ్ సత్తార్ రా ఏజెంట్ గా చూపించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. ఉగ్రవాదుల మద్యలో ఉంటు వారి సమాచారంను ఇండియాకు చేరవేసే పాత్రను ఆమె చేయబోతుందట. యాక్షన్ సన్నివేశాలతో పాటు అత్యంత కఠినమైన పరిస్థితుల్లో ఆమె చేయాల్సి ఉంటుందట. ఈ సినిమా కోసం ఆమె చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుందట. ఇటీవలే ఒక చిట్ చాట్ లో ఆమె ఈ సినిమా ఒక విభిన్నమైన అనుభవం అంటూ వ్యాఖ్యలు చేసింది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో కాజల్ రా ఏజెంట్ గా శత్రు దేశంలో పని చేస్తుంది. అక్కడ ఆమె ఒక వేశ్యగా వ్యవహరిస్తుందట. ఉగ్రవాదుల కు సన్నిహితంగా ఉంటూనే వారిని మట్టుపెట్టేందుకు ఇండియన్ ఆర్మీకి సహకరించే డేరింగ్ అండ్ డాషింగ్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు. లేడీ రా ఏజెంట్ గా నటించడం అంటే మామూలు విషయం కాదు. నటన పరంగానే కాకుండా ఫిజిక్ పరంగా కూడా కాజల్ ఈ సినిమా తో ఆకట్టుకుంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు చేసిన సినిమాలతో పోల్చితే ఈ సినిమా కోసం కాజల్ కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నట్లుగా చెబుతున్నారు. కాజల్ ముందు ఉన్న ఈ ఛాలెంజింగ్ రోల్ ను ఎంత సమర్థవంతంగా చేస్తుందో చూడాలి.