Begin typing your search above and press return to search.
మగాళ్లకు ముందు నేర్పండి : కాజల్
By: Tupaki Desk | 20 July 2018 6:44 AM GMTప్రస్తుతం టాలీవుడ్ నుంచి కోలీవుడ్ కు షిఫ్ట్ అయిన కాస్టింగ్ కౌచ్ వివాదం అసలు ఎక్కడ ఆగుతుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. శ్రీరెడ్డి మొదలుపెట్టిన ఈ రచ్చ ఆధారాలు లేకుండానే ఇన్ని రోజులు వెలుగులో ఉండటం ఆశ్చర్యమే. తమిళనాట దీని మీద ఇంకా ప్రెస్ మీట్లు ఖండనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కాజల్ అగర్వాల్ దీని మీద స్పందించింది. కాకపోతే అందరిలా కాకుండా కాస్త ఆలోచింపజేసేలా తన మాటలు ఉండటం విశేషం. అందరు మాట్లాడుతున్న కాస్టింగ్ కౌచ్ గురించి తనకు అవగాహన లేదని ఎందుకంటే అలాంటి చేదు సంఘటనలు తనకు ఎదురు కాలేదని స్పష్టం చేసింది. అంతే కాదు అసలు ఇది ఉందో లేదో కూడా తెలియదని చెప్పేసింది. అచ్చంగా ఇదే తరహాలో గతంలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా కామెంట్స్ చేసినప్పుడు శ్రీరెడ్డి చాలా ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. వాటికి బదులు రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం పెద్ద చర్చే జరిగింది.
ఇంతటితో చెప్పేసి వదిలేయలేదు కాజల్. అమ్మాయిలకు అతి జాగ్రత్తలు చెప్పడం కన్నా వాళ్ళ పట్ల ఎలాంటి ప్రవర్తన ఉండాలో ముందు ఇంట్లో ఉన్న మగపిల్లలకు నేర్పాల్సిన బాధ్యత మన మీదే ఉందని కొత్త పాయింట్ చెప్పింది. అబ్బాయికి చిన్న వయసు నుండే ఇలాంటి విషయాలు బోధిస్తే ఏది మంచి ఏది చెడు అని వాళ్ళు తెలుసుకుంటారని ఇలాంటి మార్పు వచ్చినప్పుడే దురాగతాలు తగ్గుతాయని చెప్పింది. సినిమాల గురించి అని కాదు కానీ కాజల్ చెప్పింది సమాజానికి కూడా వర్తిస్తుంది. రోజు రోజుకి పెచ్చుమీరుతున్న అకృత్యాలు ప్రతి చోటా జరుగుతూనే ఉన్నాయి. మొన్న చెన్నైలో ఓ మూగబాలికపై పాతిక మంది అత్యాచారం చేయటం సంచలనం రేపింది. కాబట్టి కాజల్ చెప్పినట్టు పేరెంటింగ్ ఇంట్లోనే పద్దతిగా జరగాలి. కాజల్ ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో రెండు సినిమాల్లో జోడిగా నటిస్తుండగా క్వీన్ తమిళ రీమేక్ పారిస్ పారిస్ షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది.విజయ్ దేవరకొండ సరసన కెఎస్ రామారావు నిర్మించే ప్రాజెక్ట్ కూడా తనకే వస్తుందనే ప్రచారం జోరుగా ఉంది. ఈ నేపధ్యంలో కాస్టింగ్ కౌచ్ గురించి కాజల్ చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.