Begin typing your search above and press return to search.

కాజల్‌ దాదాపుగా ఫైనల్‌ అయినట్లే!

By:  Tupaki Desk   |   3 Dec 2018 6:43 AM GMT
కాజల్‌ దాదాపుగా ఫైనల్‌ అయినట్లే!
X
హీరోయిన్స్‌ లో ఎక్కువ శాతం మంది స్టార్స్‌ గా కొంత కాలం మాత్రమే ఉంటారు. కాని కొందరు హీరోయిన్స్‌ మాత్రం పుష్కర కాలం అయినా కూడా హీరోయిన్స్‌ గా స్టార్‌ డం తో దూసుకు పోతూనే ఉంటారు. తాజాగా కాజల్‌ అదే జాబితాలో నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ఈమె కెరీర్‌ ఖతం అయ్యిందని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా ఆఫర్లు దక్కించుకుంటూ వస్తోంది. పుష్కర కాలంగా తెలుగు తమిళ సినీ పరిశ్రమలో మంచి హీరోయిన్‌ గా దూసుకు పోతున్న కాజల్‌ మరో భారీ ఆఫర్‌ రావడం జరిగింది.

2.ఓ చిత్రంతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు శంకర్‌ తన తదుపరి చిత్రాన్ని కమల్‌ హాసన్‌ తో చేస్తున్న విషయం తెల్సిందే. భారతీయుడుకు సీక్వెల్‌ గా ఇండియన్‌ 2 అనే టైటిల్‌ తో ఆ చిత్రం రూపొందబోతుంది. కమల్‌ కు జోడీగా మొదట నయనతారను అనుకున్నారు. ఆమె డేట్లు మరియు పారితోషికం ఇబ్బందిగా మారడంతో ఆమె స్థానంలో కాజల్‌ ను ఎంపిక చేసినట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ వార్తలపై క్లారిటీ వచ్చేసింది.

కాజల్‌ కొత్త హెయిర్‌ స్టైల్‌ కు మారబోతున్నట్లుగా సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చిందట. కాజల్‌ హెయిర్‌ డ్రస్‌ కోసం అమెరికా నుండి నిపుణులను రప్పిస్తున్నట్లుగా కూడా తమిళ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. శంకర్‌ కథ పూర్తిగా చెప్పకుండానే కాజల్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. శంకర్‌ దర్శకత్వంలో చిన్న పాత్రను చేయాలని ఎంతో మంది అనుకుంటూ ఉంటారు. అలాంటిది కాజల్‌ కు హీరోయిన్‌ ఛాన్స్‌ వస్తే కథ ఏంటీ అని కూడా అడుగుతుందా చెప్పండి. మొత్తానికి కాజల్‌ ‘ఇండియన్‌ 2’ లో ఫిక్స్‌ అయినట్లే. వచ్చే నెలలో ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.