Begin typing your search above and press return to search.

కాజల్‌ క్రేజ్‌ 2 కోట్లు.. బీభత్సహా!!

By:  Tupaki Desk   |   8 Nov 2015 1:30 PM GMT
కాజల్‌ క్రేజ్‌ 2 కోట్లు.. బీభత్సహా!!
X
చంద‌మామ కాజ‌ల్‌ కి ఉన్న అసాధార‌ణ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఈ అమ్మ‌డి క్యూట్ అప్పియ‌రెన్స్, హాట్ అప్పీల్‌ ఇప్ప‌టికీ కుర్ర‌కారుకు గిలిగింత‌లు పెడుతూనే ఉంది. 30కి చేరువైనా ఇప్ప‌టికీ వ‌న్నెత‌ర‌గ‌ని సిరుల‌తో సౌత్ ఇండ‌స్ర్టీని ఏల్తోంది. మ‌రోవైపు బాలీవుడ్‌ లో ఎద‌గాల‌న్న త‌న క‌ల‌ల్ని కాజ‌ల్ నిజం చేసుకుంటోంది. తెలివిగా తంబీల‌కు వ‌ల వేస్తూనే, ముంబై ప‌రిశ్ర‌మ‌లో పాద‌ర‌సంలా చొచ్చుకుపోతోంది.

అంతేకాదు ఈ అమ్మ‌డు సామాజిక వెబ్‌ సైట్ ల‌లోనూ అభిమానుల్ని అసాధార‌ణంగా పెంచుకుంటోంది. బ‌న్నికి ల‌క్ష‌ల్లో ఫేస్ బుక్ ఫాలోవ‌ర్స్ ఉన్నారు అత‌డే నంబ‌ర్ వ‌న్ అని ఇటీవ‌లే చెప్పుకున్నాం. అయితే అంత‌కు మించి ఫేస్‌ బుక్‌ లో ఫాలోయింగ్ సంపాదించుకున్న చంద‌మామ గురించి అప్పుడు ప్ర‌స్థావించ‌నేలేదు. ల‌క్ష‌ల్లో కాదు కోట్ల‌లోనే అభిమానులు ఈ అమ్మ‌డిని ఫాలో అవుతున్నారు.. అన్న‌ది న‌మ్మాల్సిన ఫ్యాక్ట్‌.

ఈ అమ్మ‌డిని ఫేస్‌ బుక్‌ లో ఏకంగా కోటి 80 ల‌క్ష‌ల మంది అభిమానులు ఫాలో చేస్తున్నారు. నిత్యం అంద‌రితో ముచ్చ‌ట్లాడుతోంది క్యూటీ. ఇది నిజంగానే కాజ‌ల్ జీవితంలో ఓ అఛీవ్‌ మెంట్ అంటే త‌ప్పేం కాదు. 18 మిలియ‌న్‌ ల లైక్‌ లు అంటే మామూలు విష‌య‌మా? షుమారు ఓ రెండు కోట్లకు త్వరలోనే చేరుకుంటుంది. బీభత్సాది బీభత్సం కదండీ ఈ విషయం. ఫేడవుట్‌ అయ్యిందనుకున్న ఈమె చేతిలో ఇప్పుడు మహేష్‌ బ్రహ్మోత్సవం, పవన్‌ సర్దార్‌ ఉన్నాయ్‌. అదీ లెక్క.