Begin typing your search above and press return to search.

నా డ్యాన్సుల స్టయిలే మార్చేశారు

By:  Tupaki Desk   |   12 Dec 2016 5:30 PM GMT
నా డ్యాన్సుల స్టయిలే మార్చేశారు
X
అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ టాలీవుడ్ లో తిరుగులేని డ్యాన్సర్ ఎవరంటే మాత్రం.. మెగాస్టార్ చిరంజీవి ఒక్కరే అనే విషయం ఎవరైనా చెబుతారు. ఆయన తరువాత ఆయన రేంజులో చాలామంది స్టార్లు స్టెప్పులేస్తున్నా కూడా.. ఆ గ్రేస్ అండ్ ఛామ్ మాత్రం చిరంజీవికే సొంతం. అలాంటి మెగాస్టార్ ప్రక్కన చిందేయాలంటే హీరోయిన్ లో ఎంత టాలెంట్ ఉండాలి?

''మొదట్లో కాస్త కంగారు పడ్డాను. ఆయన ఎనర్జీతో నా స్టెప్పులు మ్యాచ్ చేయడం కాస్త కష్టమే అయ్యింది'' అంటోంది కాజల్ అగర్వాల్. అమ్మడు చరణ్‌.. బన్నీ.. పవన్ లతో సినిమాలు చేశాక.. ఇప్పుడు పెద్దాయన చిరంజీవితో ఖైదీ నెం 150 కోసం జతకట్టిన సంగతి తెలిసిందే. ''ఖైదీ పాటలను షూట్ చేస్తున్నప్పుడు.. నేను వేసే స్టెప్పుల్లో చిరంజీవి సార్ కొన్ని మార్పులను సూచించారు. వాటితో నా డ్యాన్సుల స్వరూపమే మారపోయింది. ఇప్పుడు నా స్టెప్పుల్లో కూడా ఎనలేని గ్రేస్ కనిపిస్తోంది. తెరపైన సాంగ్స్ చూసినప్పుడు మీకు ఆ విషయం అర్ధమవుతుంది'' అంటూ సెలవిచ్చేసింది చందమామ.

ఇప్పటికే ఈ సినిమాలో కాజల్ హిప్ షేకింగ్ బాగా అదిరిపోయిందని ఒక టాక్ నడుస్తోంది. ఈ సమయంలో స్వయంగా కాజల్ తన డ్యాన్సుల్లో కొత్త స్టయిల్ ఇంట్రొడ్యూస్ చేశానని చెప్పడం మరి కిక్కిచ్చే విషయమే. పాటల టీజర్లొచ్చాక ఈ విషయమేంటో చూసుకుందాం మరి!!