Begin typing your search above and press return to search.
చందమామకు గట్టి దెబ్బ తగిలిందే
By: Tupaki Desk | 20 July 2015 1:55 PM GMTసౌత్ ఇండియాలో ఏ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నా.. మరో ఇండస్ట్రీ నుంచి ఆటోమేటిగ్గా అవకాశాలు వచ్చేస్తాయి. ముఖ్యంగా తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో హీరోయిన్లను ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం ముందు నుంచి ఉంది. ఇక్కడ పేరొస్తే అక్కడ అవకాశాలొస్తాయి. అక్కడ పేరొస్తే ఇక్కడ అవకాశాలు వస్తాయి. ఒకచోట అవకాశాలు తగ్గినా.. ఇంకో చోట జోరందుకునే ఛాన్స్ ఉంటుంది మన హీరోయిన్లకు. త్రిష, నయనతార, హన్సిక, సమంత, తమన్నా.. వీళ్లందరూ ఇలా ఎప్పటికప్పుడు స్థావరాలు మార్చేసిన వాళ్లే. ఇప్పుడు చందమామ కాజల్ కూడా ఆ పనే చేస్తోంది. తెలుగులో అవకాశాలు తగ్గగానే ఇక్కడి నుంచి జెండా ఎత్తేసి చెన్నైలో పాతేసింది.
కోలీవుడ్లో ఆమెకిప్పుడు స్టార్ హీరోల సరసన వరుసగా అవకాశాలొస్తున్నాయి. ట్రాక్ రికార్డు కూడా బానే ఉండటంతో ఇంకో మూణ్నాలుగేళ్లు అక్కడ దున్నేసుకోవచ్చనుకుంది కాజల్. కానీ ధనుష్ సరసన ఆమె నటించిన కొత్త సినిమా ‘మారి’ ఏ విధమైన ప్రయోజనమూ ఇవ్వలేదు. డివైడ్ టాక్ తో మొదలైన ఈ సినిమాకు ఓపెనింగ్స్ బాగానే ఉన్నాయి కానీ.. సినిమా ఎంతో కాలం థియేటర్లలో నిలిచే అవకాశాలు కనిపించడం లేదు. సినిమాకు ఏమైనా ప్రశంసలు వచ్చాయంటే అది ఒక్క ధనుష్ విషయంలోనే. కాజల్ గురించి అందరూ నెగెటివ్ గానే రాశారు. ప్రాధాన్యం లేని పాత్రలో కాజల్ ఏమాత్రం ప్రత్యేకత చూపించలేకపోయిందని.. ధనుష్ తో ఆమె రొమాంటిక్ ట్రాక్ తేలిపోయిందని అంటున్నారు. ఇందులో తన తప్పేమీ లేకున్నా.. కాజల్ నిందలు మోయక తప్పట్లేదు. ‘మారి’తో తన కెరీర్ ఎక్కడికో వెళ్లిపోతుందనుకుంటే.. ఇప్పుడు ఆ సినిమానే తనను వెనక్కి లాగుతుండటం కాజల్ ను బాధపెడుతోంది.