Begin typing your search above and press return to search.
క్వీన్ల రేసు - కాజల్ దే గ్రేసు
By: Tupaki Desk | 25 Sep 2018 12:08 PM GMTబాలీవుడ్ లో నాలుగేళ్ళ క్రితం కంగనా రౌనత్ టైటిల్ రోల్ పోషించిన క్వీన్ ఎంతటి సంచలన విజయం సాధించిందో నటిగా తనకు అంత కన్నా ఎక్కువ గుర్తింపు ఇచ్చింది. అప్పటి నుంచి దీన్ని వివిధ భాషల్లో రీమేక్ చేయాలనీ ప్రయత్నించినప్పటికీ ఫైనల్ ఇప్పటికి కుదిరింది. ఒకేసారి నాలుగు భాషల్లో నలుగురు వేర్వేరు హీరోయిన్లు దర్శకులతో రూపొందిన క్వీన్ రీమేక్ వెర్షన్లు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతున్నాయి. ఈ సందర్భంగా ప్రమోషన్లు మొదలుపెట్టేసిన నిర్మాతలు ఒకేసారి నలుగురి ఫస్ట్ లుక్స్ విడుదల చేసారు.
తమిళ్ లో కాజల్ మలయాళం లో మంజిమా మోహన్ కన్నడ లో పరుల్ యాదవ్ చేస్తున్న ఈ పాత్ర తెలుగులో మిల్కీ బ్యూటీ తమన్నా చేస్తోంది. ఇలా ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు సహజంగానే ఎవరు బాగున్నారు అనే పోలిక వస్తుంది. ఒకే కథ కాబట్టి ఎవరు బాగుంటారు అనే కోణంలో చాలా విశ్లేషణలు జరుగుతాయి. ఇప్పటి దాకా వచ్చిన లుక్స్ లో చూసుకుంటే గ్రేస్ పరంగా గ్లామర్ పరంగా కాజల్ అగర్వాల్ ఫుల్ మార్క్స్ కొట్టేస్తోంది. నిజానికి తనతో సమానంగా పోటీ పడే అందం ఉన్న తమన్నా తెలుగు వర్షన్ కు వచ్చేటప్పటికి తేలిపోయింది. కాస్త డీ గ్లామర్ టచ్ ఇచ్చే ప్రయత్నం బెడిసికొట్టింది. మంజిమా మోహన్ పర్వాలేదు అనిపించగా పరుల యాదవ్ జూనియర్ ఆర్టిస్ట్ కి ఎక్కువ హీరోయిన్ కి తక్కువ అనేలా ఉంది.
మొత్తానికి కాజల్ తప్ప ఎవరూ మెస్మరైజ్ చేయలేదన్నది నిజం. పోస్ట్ ప్రొడక్షన్లో బిజీగా ఉన్న ఈ నాలుగు వెర్షన్లు ఒకేసారి విడుదల అవుతాయి. తెలుగు వర్షన్ కు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించగా తమిళ్ కు రేవతి గారు బాధ్యతలు తీసుకున్నారు. తెలుగుకు దటీజ్ మహాలక్ష్మి టైటిల్ ఉండగా తమిళ్ లో పారిస్ పారిస్ అని వెరైటీగా పెట్టారు. లుక్స్ లో కాజల్ విన్ అయ్యింది కానీ టీజర్ వచ్చాక మరోసారి క్లియర్ గా ఎవరు నిజమైన క్వీన్ అనేది తెలిసిపోతుంది.